Virat Runs Against Each Team IPL : ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ బ్యాటర్ కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. అత్యధిక పరుగులు చేసిన లిస్టులో 248 పరుగులతో టాప్ ఫైవ్‌లో ఉన్నాడు. ప్రత్యర్థి ఎవరైనా తనదైన శైలిలో రెచ్చిపోతున్నాడు. అయితే తన ఐపీఎల్ కెరీర్‌లో ఏయే టీమ్‌పై విరాట్ ఎన్ని పరుగులు చేశాడు? అన్నింకటే అత్యధిక పరుగులు బాదింది ఏ జట్టుపై? ఈ విషయాలు తెలుసుకుందాం!
- చెన్నై సూపర్ కింగ్స్ (CSK) : ఐపీఎల్‌లో విరాట్ సీఎస్కేపై అత్యధిక పురుగులు చేశాడు. తన కెరీర్‌లో చెన్నైపై 1,084 పరుగులు చేశాడు. రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో వంటి టాప్ బౌలర్లను ఎదుర్కొని, మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లతో తన క్లాస్‌ను చూపించాడు.
- దిల్లీ క్యాపిటల్స్ (DC) : దిల్లీ క్యాపిటల్స్‌పై కోహ్లీ 1,057 పరుగులు చేశాడు. అయితే కోహ్లీ దిల్లీకి చెందిన ప్లేయర్. కానీ, ఐపీఎల్ ప్రారంభం నుంచి ఆర్సీబీలోనే కీలక ప్లేయర్‌గా మారిపోయాడు.
- పంజాబ్ కింగ్స్ (PBKS) : ఐపీఎల్ కెరీర్‌లో కోహ్లీ అత్యధిక పరుగుల సాధించిన మూడో జట్టు పంజాబ్ కింగ్స్. పంజాబ్‌పై కూడా విరాట్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. ఈ జట్టుపై తన కెరీర్‌లో 1,030 పరుగులు సాధించాడు.
- కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) : సునీల్ నరైన్ వంటి కేకేఆర్ మిస్టరీ స్పిన్నర్లు కోహ్లీని సవాలు చేశారు. అయినా కోహ్లీ కేకేఆర్‌పై 1,021 పరుగులు చేశాడు.
- ముంబయి ఇండియన్స్ (MI) : ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన, బలమైన టీమ్ ముంబయి ఇండియన్స్‌పై కోహ్లీ 855 పరుగులు చేశాడు. జస్ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగ, మిచెల్ జాన్సన్ వంటి టాప్ క్లాస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు.
- రాజస్థాన్ రాయల్స్ (RR) : రాజస్థాన్ రాయల్స్‌పై కోహ్లీ 764 పరుగులు చేశాడు. అతడి కెరీర్‌లో రాజస్థాన్‌పై కొన్ని అద్భుత ఇన్నింగ్స్‌లు ఉన్నాయి.
- గుజరాత్ టైటాన్స్ (GT) : ఐపీఎల్‌లో 2022లో అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్‌పై కోహ్లీ 351 పరుగులు చేశాడు. తక్కువ మ్యాచ్‌లే ఆడినా తన సత్తా ఏంటో చూపించాడు.
- దక్కన్ ఛార్జర్స్ (DC) : దక్కన్ ఛార్జర్స్ ఇప్పుడు లేదు. కానీ ఐపీఎల్ ప్రారంభ సంవత్సరాల్లో కోహ్లీ ఆ జట్టుపై 306 పరుగులు చేశాడు.
- గుజరాత్ లయన్స్ (GL) : గుజరాత్ లయన్స్ కూడా 2016, 2017 రెండు సీజన్లలో ఆడింది. ఈ టీమ్‌పై కోహ్లీ 283 పరుగులు చేశాడు.
- లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (LSG) : లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కూడా ఇటీవల వచ్చిన జట్టే. ఈ టీమ్‌పై కోహ్లీ 139 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో మరిన్ని పరుగులు చేసే అవకాశం ఉంది.
- పూణే వారియర్స్ ఇండియా (PW) : పుణే వారియర్స్ కొద్దికాలం మాత్రమే ఉంది. ఈ జట్టుపై విరాట్ వారిపై 128 పరుగులు చేశాడు.
IPL ఆరెంజ్ క్యాప్ రికార్డ్- వరుసగా 2 సార్లు ఆ ఒక్కడికే- విరాట్, వార్నర్ కాదు!
గ్రౌండ్‌లోనే కిస్ పెట్టిన కోహ్లీ! అందరూ షాక్! అసలేం ఏం జరిగిందంటే?