Virat Kohli announces retirement from Test : టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెసట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈమేరకు ఇన్‌స్టాలో సుదీర్ఘ ఎమోషనల్ పోస్ట్ చేశాడు.
కింగ్ కోహ్లీ 14 ఏళ్లపాటు భారత్ తరఫున టెస్టులకు ప్రాతినిధ్యం వహించాడు. విరాట్ తన కెరీర్‌లో 123 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఇప్పటివరకు టెస్టుల్లో 9,230 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, 2011లో వెస్ట్ ఇండీస్‌తో అరంగేట్రం చేశాడు. కాగా, 3 జనవరి 2025న ఆస్ట్రేలియాతో విరాట్ కోహ్లీ చివరి టెస్టు ఆడాడు.
'ప్రేమతో సైనింగ్ ఆఫ్'
"టెస్ట్ క్రికెట్లో నేను తొలిసారి బ్యాగీ బ్లూ దుస్తులు ధరించి 14ఏళ్లు అయింది. నిజాయితీగా చెప్పాలంటే, ఈ ఫార్మాట్ నన్ను ఈ ప్రయాణంలో తీసుకెళ్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఇది నన్ను పరీక్షించింది. తీర్చిదిద్దింది. జీవితాంతం నేను పాటించాల్సిన పాఠాలు నేర్పింది. తెల్లని దుస్తుల్లో ఆడటంలో ఏదో లోతైన విషయం దాగుంది. నిశ్శబ్దమైన ఆనందం, సుదీర్ఘమైన రోజులు, ఎవరికీ కన్పించని చిన్న చిన్న క్షణాలు నాతో ఎప్పటికీ ఉండిపోతాయి. అలాంటి ఈ ఫార్మాట్ నుంచి దూరం జరగడం అంత తేలిక అయిన విషయం కాదు. కానీ, నా నిర్ణయం సరైనదే అనిపిస్తోంది. ఈ ఫార్మాట్ కోసం నేను ఎంతో ఇచ్చాను. ఆశించిన దాని కంటే ఎక్కువే ఇది నాకు తిరిగిచ్చింది. మనసు నిండా సంతృప్తితో, కృతజ్ఞతాభావంతో ఈ ఫార్మాట్ నుంచి వైదొలుగుతున్నా. ఈ గేమ్, నేను మైదానంలో ఆడిన నా తోటి ప్లేయర్లు, ఈ ప్రయాణాన్ని నేను చూడటానికి కారణమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. వెనక్కి తిరిగి నా టెస్టు కెరీర్‌ను చూసుకుంటే నా ముఖంలో చిరునవ్వు కన్పిస్తుంది. ప్రేమతో ఇక #269, సైనింగ్ ఆఫ్" అని కోహ్లీ తన పోస్టులో రాసుకొచ్చాడు.
షాకింగ్ : విరాట్ కోహ్లీ రిటైర్మెంట్?- BCCIకి కూడా చెప్పేశాడట!