Virat Kohli Earnings: ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్లలో టీమ్‌ఇండియా ప్లేయర్లు సచిన్ తెందూల్కర్, ఎంస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అత్యంత ధనవంతులు. ప్రస్తుత సంపాదన విషయానికి వస్తే విరాట్ అందరికంటే ముందుంటాడు. వీళ్లే కాకుండా అనేక మంది అథ్లెట్లు భారీగానే సంపాదిస్తున్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా గత 12నెలల్లో అత్యధికంగా సంపాదించిన అథ్లెట్ల జాబితాలో విరాట్ స్థానం సంపాదించాడు. అంతే కాకుండా ఈ లిస్టులో ఉన్న ఏకైక క్రికెటర్ విరాట్ కోహ్లీయే. మరి గడిచిన 12నెలల్లో విరాట్ సంపాదన ఎంత? ఈ లిస్ట్‌లో టాప్‌లో ఎవరు ఉన్నారో తెలుసా?
అత్యధికంగా సంపాదిస్తున్న క్రికెటర్
టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గడిచిన 12 నెలల్లో రూ.847 కోట్లు సంపాదించాడు. మొత్తం క్రీడాకారుల జాబితాలో విరాట్ తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో పోర్చుగల్ ఫుట్‌బాల్ లెజెండ్ క్రిస్టియానొ రొనాల్డో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. అతడు గత 12నెలల్లో రూ.2081 కోట్లు సంపాదించాడు. స్పానిష్ ప్రొఫెషనల్ గోల్ఫర్ జాన్ రాహ్మ్ రెండో స్థానంలో ఉండగా, స్టార్ అర్జెంటీనా ఫుట్‌బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ మూడో స్థానంలో ఉన్నాడు.
అమెరికన్ బాస్కెట్‌బాల్ స్టార్ లెబ్రాన్ జేమ్స్ నాలుగు, గ్రీక్-నైజీరియన్ బాస్కెట్‌బాల్ ఆటగాడు జియానిస్ ఆంటెటోకౌన్‌పో ఐదో స్థానాల్లో ఉన్నారు. చివరి ఐదు స్థానాల్లో వరుసగా ఫ్రాన్స్ ఫుట్‌బాల్ ఆటగాడు కైలియన్ ఎంబాప్పే, బ్రెజిల్ ఫుట్‌బాల్ ప్లేయర్ నెయ్‌మార్, ఫ్రాన్స్ ఫుట్‌బాల్ స్టార్ కరీమ్ బెంజెమా, ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, అమెరికా బాస్కెట్‌బాల్ ఆటగాడు స్టీఫెన్ కర్రీ పదో స్థానంలో ఉన్నారు.
ఇన్కమ్ సోర్స్
విరాట్ బీసీసీఐ గ్రేడ్ A+ సెంట్రల్ కాంట్రాక్ట్ ఉంది. ఇలా బోర్డు నుంచి ప్రతి సంవత్సరం రూ.7 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. ఐపీఎల్‌లో ఆర్సీబీ నుంచి ఏడాదికి రూ.15 కోట్లు అందుకుంటాడు. అలాగే వివిధ బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల నుంచి భారీ ఆదాయం ఉంటుంది. అలాగే వివిధ కంపెనీల్లో వాటా దారుడిగా కూడా విరాట్ కొనసాగుతున్నాడు.
పన్ను చెల్లింపుల్లోనూ టాప్
2024 ఆర్థిక సంవత్సరంలో విరాట్ కోహ్లీ ఏకంగా రూ.66 కోట్ల రూపాయల పన్ను చెల్లించాడు. అత్యధిక పన్ను చెల్లించిన భారతీయ క్రీడాకారుడిగా నిలిచాడు.
Virat Kohli ranked as the highest-paid cricketer globally over the last 12 months, according to a Statista report.
— Nilesh Biswas (@NileshBiswas18) September 6, 2024
- His estimated earnings?
A whopping ₹847 crore! 🔥#ViratKohli #ViratKohli𓃵 #CristianoRonaldo #CR7𓃵 #DuleepTrophy2024 #India pic.twitter.com/aPyOksFVlZ
కోహ్లీకి 'చీకు' పేరు ఎలా వచ్చిందో తెలుసా? - Kohli Nickname
ఇండియా క్రికెట్ 'కుబేరుడు' ఇతడే - సచిన్, విరాట్ కాదు! - Indias Richest Cricketer