ETV Bharat / sports

ప్రభుత్వ ఉద్యోగం వద్దన్న వినేశ్‌ ఫొగట్‌- రూ.4 కోట్ల బహుమతి కోరుతూ లేఖ - VINESH PHOGAT GOT 4 CRORE

మూడు అవకాశాలు ఇచ్చిన హరియాణా ప్రభుత్వం- అవేంటంటే?

vinesh phogat 4 crore
vinesh phogat 4 crore (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : April 11, 2025 at 9:04 PM IST

2 Min Read

Vinesh Phogat Got 4 Crore : కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రముఖ మాజీ రెజ్లర్ వినేశ్‌ ఫొగాట్‌ హరియాణా ప్రభుత్వం నుంచి రూ.4 కోట్ల నగదు బహుమతిని స్వీకరించాలని నిర్ణయించుకున్నారు. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో ఆమె ప్రదర్శనను గౌరవిస్తూ ఈ బహుమతిని ఇవ్వనున్నారు. ఆమె ఒలింపిక్స్‌లో 50 కిలోల రెజ్లింగ్ ఈవెంట్‌ ఫైనల్‌కి అర్హత సాధించి రికార్టు క్రియేట్‌ చేసింది. అయితే ఫైనల్‌కు ముందు దురదృష్టవశాత్తు 100 గ్రాముల అధిక బరువు ఉండటంతో అనర్హత వేటు పడింది. ఈ క్రమంలోనే హరియాణా ప్రభుత్వం ఆమెకు మూడు అవకాశాలు ఇచ్చింది. రూ. 4కోట్ల నగదు బహుమతి, నివాస స్థలం లేదా గ్రూప్ ఎ ప్రభుత్వ ఉద్యోగం. ఈ మూడింటిలో వినేశ్‌ నగదు బహుమతిని ఎంపిక చేసుకున్నారు.

లేఖ రాసిన వినేశ్‌
ఒలింపిక్స్‌ నుంచి బయటకు వచ్చిన వినేశ్‌, తనకు రజత పతకం అయినా ఇవ్వాలని పోరాడింది. కానీ నిబంధనల మేరకు ఒలింపిక్స్‌ కమిటీ అంగీకరించలేదు. తర్వాత ఆమె రెజ్లింగ్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటించి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అయితే ఇటీవల హరియాణా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని, రాష్ట్ర మంత్రివర్గం వినేష్‌ను ఒలింపిక్ రజత పతక విజేతగానే గుర్తించాలని నిర్ణయించిందని పేర్కొన్నారు. క్రీడా విధానం కింద ఆమెకు అదే ప్రయోజనాలను అందించేందుకు అంగీకరించిందని ప్రకటించారు. ఈ హామీని మార్చిలో హరియాణా అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో వినేశ్‌ ప్రభుత్వానికి గుర్తు చేసింది. దీంతో ప్రభుత్వం మూడు అవకాశాలు ఇచ్చింది. తాజాగా వినేష్ రూ.4 కోట్ల నగదు బహుమతి ఎంచుకున్నట్లు రాష్ట్ర క్రీడా విభాగానికి ఒక లేఖ పంపింది.

అసెంబ్లీలో వినేశ్‌ నెరవేరని హామీ గురించి మాట్లాడుతూ, ‘నేను హరియాణా కూతురినని, రజత పతక విజేతగా బహుమతి పొందుతానని ముఖ్యమంత్రి చెప్పారు. ఆ వాగ్దానం ఇప్పటికీ పూర్తి కాలేదు. ఇది డబ్బు గురించి కాదు గౌరవం గురించి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు నేను ఇప్పటికే అవార్డు అందుకున్నానని అనుకుంటున్నారు’ అని చెప్పారు. హరియాణా ప్రభుత్వం హరియాణా షెహ్రీ వికాస్ ప్రాధికారన్ (HSVP) ద్వారా ఈ బహుమతులు అందిస్తుంది. అగ్రశ్రేణి అథ్లెట్ల విజయాలకు గుర్తింపుగా స్పోర్ట్స్‌ కోటాలో డిప్యూటీ డైరెక్టర్ స్థాయి ఉద్యోగం వంటివి కేటాయించి గౌరవిస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.