Head On Abhishek Note Celebrations : 2025 ఐపీఎల్లో సన్‌రైజర్స్ ఎట్టకేలకు మళ్లీ గెలుపు బాట పట్టింది. శనివారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అదిరే బ్యాటింగ్‌తో విజయం సాధించింది. 246 పరుగుల భారీ లక్ష్యాన్ని సైతం మరో 9 బంతులు ఉండగానే ఛేదించి ఔరా అనిపించింది. యంగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ (141 పరుగులు) భారీ సెంచరీ వల్ల సన్‌రైజర్స్ అలవోకగా విజయం సాధించింది.
అయితే 40 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన అభిషేక్ మైదానంలో వినూత్నంగా సంబరాలు చేసుకున్నాడు. తన జేబులో నుంచి ఓ పేపర్ తీసి కెమెరాకు చూపిస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. పేపర్‌పై 'This is for Orange Army' (ఇది ఆరెంజ్ ఆర్మీ కోసం) అని నోట్ రాసి ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అయితే ఈ సంబరం వెనుక ఉన్న సీక్రెట్‌ను తన సహచర బ్యాటర్ ట్రావిస్ హెడ్ రివీల్ చేశాడు.
మ్యాచ్ అనంతరం హెడ్ బ్రాడ్‌కాస్టర్ చిట్‌చాట్‌లో మాట్లాడాడు. ఈ క్రమంలోనే అభిషేక్ సెంచరీ సెలబ్రేషన్స్ సీక్రెట్ ఒకటి చెప్పాడు. ఈ సీజన్ ప్రారంభం నుంచి అభిషేక్ ఆ పేపర్ జేబులో పెట్టుకొని బ్యాటింగ్‌కు వస్తున్నాడని తెలిపాడు. కానీ, ఆరో మ్యాచ్‌లో దానిని బయటకు తీసే ఛాన్స్ వచ్చిందని అన్నాడు. 'ఈ సీజన్ ప్రారంభం నుంచే అభిషేక్ జేబులో ఆ పేపర్ నోట్ ఉంది. అదృష్టవశాత్తు ఈరోజు రాత్రి దాన్ని బయటకు తీసే అవకాశం వచ్చింది' అని హెడ్ అన్నాడు.

హెడ్ వ్యాఖ్యలతో అభిషేక్‌లో చాలా కసి దాగి ఉందోనని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ లెక్కన అభిషేక్ తొలి మ్యాచ్ నుంచే సెంచరీ కోసం ప్రయత్నిస్తున్నాడని, ఆరు మ్యాచ్‌ల తర్వాతైనా శతకం సాధించడం ఆనందంగా ఉందని సన్‌రైజర్స్ ఫ్యాన్స్ అంటున్నారు.
Kavya Maran congratulating Abhishek Sharma's family. 🥹
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 12, 2025
- Moment of the day! ❤️pic.twitter.com/BqlelGoXdu
తన సెంచరీపై అభిషేక్ కూడా మాట్లాడాడు. 'ఇది నాకు ఎంతో ప్రత్యేకం. వరుస ఓటముల నుంచి బయటకు రావాలని అనుకున్నా. నాలుగు మ్యాచ్‌ల్లో ఓడడం కష్టంగా ఉంటుంది. కానీ మా జట్టులో దాని గురించి చర్చ ఉండదు. యువరాజ్ సింగ్, సూర్యకుమార్ యాదవ్‌కు స్పెషల్ థాంక్స్. వాళ్లు నాకు టచ్‌లో ఉంటూ సలహాలు ఇస్తుంటారు. ఇక అమ్మానాన్నల ముందు సెంచరీ సాధించడం బాగుంది. వాళ్ల కోసం నేను ఒక్కడినే కాదు, మా టీమ్ మొత్తం ఎదురుచూస్తుంటుంది. ఏందుకంటే వాళ్లు సన్‌రైజర్స్ జట్టుకు లక్కీ ఛార్మ్' అని అభిషేక్ వ్యాఖ్యానించాడు.
అభిషేక్ ఉప్పల్ షేక్- 246 టార్గెట్‌ను ఊదేసిన SRH- బౌలర్ల ఊచకోత!