Piyush Chawla Retirement : టీమ్ఇండియా సీనియర్ లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తాను అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు శుక్రవారం ప్రకటించాడు. తన రిటైర్మైంట్ నిర్ణయాన్ని ఇన్‌స్టాలో ప్రకటిస్తూ పోస్ట్ షేర్ చేశాడు. కెరీర్లో తనకు సహాయ సహకారాలు అందించిన కుటుంబ సభ్యులు, ఐపీఎల్ ఫ్రాంఛైజీలు, అభిమానులకు ఈ సందర్భంగా థాంక్స్ చెప్పాడు.
కాగా, 36ఏళ్ల పీయూష్ 2007 టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు. భారత్ తరఫున మూడు టెస్టులు, 25 వన్డేలు, 7 టీ20లు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎక్కువగా అవకాశాలు దక్కలేదు. అంతర్జాతీయ క్రికెట్‌లో పీయూశ్ ఆఖరి మ్యాచ్ ఆడి దశాబ్దం దాటింది. 2012 డిసెంబర్లో ఇంగ్లాండ్‌పై లాస్ట్ మ్యాచ్ అడాడు. టెస్టుల్లో 7, వన్డేల్లో 32, టీ20ల్లో 4 వికెట్లు కూల్చాడు.
అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో రాణించలేకపోయినా, ఫ్రాంఛైజీ క్రికెట్‌లో పీయూష్ చావ్లా సత్తా చాటుకున్నాడు. ఐపీఎల్ మాత్రం అదరగొట్టాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్, ముంబయి ఇండియన్స్ జట్ల తరఫున ఆడాడు. కెరీర్లో 192 మ్యాచ్‌ల్లో 192 వికెట్లు పడగొట్టాడు. అలాగే 446 ఫస్ట్ క్లాస్ వికెట్లు, 319 టీ20 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో పలు టీమ్‌ల తరఫున ఆడాడు. 2012, 2014లో ఐపీఎల్ టైటిల్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.