ETV Bharat / sports

'ఆడింది చాలు, ఇక రెస్ట్ తీసుకో!'- ధోనీ రిటైర్మెంట్​పై మాజీల కామెంట్స్ - IPL 2025

మే 25న చెన్నై లాస్ట్ మ్యాచ్- ధోనీ రిటైర్మెంట్ ఆ రోజేనా?

Dhoni IPL Retirement
Dhoni IPL Retirement (Source : Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : May 21, 2025 at 8:01 PM IST

2 Min Read

MS Dhoni IPL Retirement : చెన్నై సూపర్ కింగ్స్ సీనియర్ ప్లేయర్ మహేంద్రసింగ్ ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్​పై కొన్నేళ్లుగా చర్చ నడుస్తూనే ఉంది. ఇదే ఆఖరి సీజన్ అంటూ గత రెండేళ్లుగా ధోనీ ఐపీఎల్ కెరీర్​పై ప్రచారం సాగుతోంది. కానీ, ఆ ప్రచారాలను కొట్టిపారేయడం, మళ్లీ కొత్త సీజన్​లో ధోనీ బరిలోకి దిగడం మామూలు విషయమైంది. ఈ క్రమంలో ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్​ అంశం తాజాగా మరోసారి చర్చనీయాంశమైంది.

ఈ సీజన్​లో చెన్నై ఇప్పటికే 13 మ్యాచ్​లు ఆడేసింది. ఇక మే 25న గుజరాత్​తో చివరి మ్యాచ్ ఆడనుంది. ఈ సీజన్​లో చెన్నైకి ఇది ఆఖరి మ్యాచ్. ఈ నేపథ్యంలోనే పలువురు మాజీ క్రికెటర్లు ధోనీ రిటైర్మెంట్​పై కామెంట్స్ చేస్తున్నారు. అతడు క్రికెట్ నుంచి తప్పుకునే సమయం వచ్చేసిందంటూ పేర్కొంటున్నారు. మరి ఎవరెవరు ఏం అన్నారంటే?

అతడే డిసైడ్ అవ్వాలి! : ఐపీఎల్‌లో ఇంకా కొనసాగాలా లేదా వీడ్కోలు పలకాలా అనే దానిపై ధోనీనే నిర్ణయం తీసుకోవాలని కృష్ణమాచారి శ్రీకాంత్‌ అన్నాడు. తన ఫిట్​నెస్​ ఆధారంగా డిసైడ్ అవ్వాలని అన్నాడు. ఈ వయసులోనూ క్రికెట్ ఆడడం ఏ మాత్రం ఈజీ కాదు. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి ఎంతో కష్టపడాల్సి ఉంటుందని అన్నాడు.

ఇక చాలు, రెస్ట్ తీసుకో! : ధోనీ రిటైర్మెంట్​పై టీమ్ఇండియా మాజీ క్రికెటర్ జోగిందర్‌ శర్మ మాట్లాడాడు. ధోనీ విశ్రాంతి తీసుకునే వేళ అయ్యిందని అన్నాడు. ధోనీ ఫిట్‌నెస్​ను పరిగణనలోకి తీసుకుంటే, అతను దాన్ని నిరూపించుకోవడానికి ఆడాల్సి ఉంటుంది. కానీ ధోనీ ఇప్పుడు రెస్ట్​ తీసుకోవాల్సిన సమయం వచ్చిందని అనుకుంటున్నాను.

నేనైతే ఎప్పుడో గుడ్ బై తప్పుకునేవాడ్ని ! : తాను ధోనీ అయితే ఇప్పటికే ఐపీఎల్​కు గుడ్ బై చెప్పేవాడినని సంజయ్‌ బంగర్‌ తెలిపాడు. టీమ్​లో తరచూ మార్పులు జరుగుతూనే ఉంటాయని, అందుకే రిటైర్మెంట్​ తీసుకోడానికి ఓ సమయం అంటూ ఉండదని అన్నాడు. ఈ క్రమంలోనే తాను తప్పుకున్నా, ఫ్రాంచైజీ దానికదే ముందుకు వెళ్తుందని గమనించాల్సి ఉంటుందని సంజయ్ పేర్కొన్నాడు.

మహేంద్రసింగ్ ధోనీ
మహేంద్రసింగ్ ధోనీ (Source : Associated Press)

అప్పుడే అవ్వాల్సింది! : 2023లో చెన్నై టైటిల్ నెగ్గినప్పుడే ధోనీ ఐపీఎల్ నుంచి రిటైర్ అవ్వాల్సిందని మనోజ్ తివారి ఓ సందర్భంలో అన్నాడు. అప్పుడే తప్పుకుంటే గౌరవంగా ఉండేదని మనోజ్ అభిప్రాయపడ్డాడు.

మరోవైపు, ధోనీ ఇప్పట్లో రిటైర్మెంట్ ప్రకటించేది లేదని ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. తనకు వచ్చే సీజన్​ వరకు దీని గురించి ఆలోచించుకునే టైమ్ ఉందని అన్నాడు. మరి చూడాలి మే 25న ధోనీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో!

కాగా, ఈ సీజన్​లో ధోనీ ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. కెప్టెన్​గానూ పెద్దగా ప్రభావం చూపలేదు. అతడి కెప్టెన్సీలో ఈసారి చెన్నై 8 మ్యాచ్​లు ఆడగా, కేవలం రెండింట్లోనే నెగ్గింది. ఇక బ్యాటింగ్​లో 13 మ్యాచ్‌ల్లో 135.17 స్ట్రైక్‌ రేట్‌తో 196 పరుగులే చేశాడు.

'2023లోనే ధోనీ రిటైర్ అవ్వాల్సింది- అదే గౌరవంగా ఉండేది'- మాజీ క్రికెటర్

IPL నుంచి ధోనీ తప్పుకుంటే బెటర్- ఇక చేయాల్సింది ఏమీ లేదు : మాజీ కెప్టెన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.