ETV Bharat / sports

విరాట్, రోహిత్​పై గిల్ స్టేట్​మెంట్- 2027 వరల్డ్​కప్​పైనా హింట్

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపై గిల్ కామెంట్స్- ఏమన్నాడంటే?

Gill On Rohit Kohli
Gill On Rohit Kohli (Source : Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : October 9, 2025 at 5:30 PM IST

2 Min Read
Choose ETV Bharat

Shubman Gill On Rohit And Virat : స్వదేశంలో వెస్టిండీస్​తో రెండో టెస్టుకు భారత్ సిద్ధమైంది. అక్టోబర్ 10న ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా కెప్టెన్ శుభ్​మన్ గిల్ ప్రెస్ కాన్ఫరెన్స్​లో మాట్లాడాడు. ఇటీవల వన్డే ఫార్మాట్​కు కూడా కెప్టెన్​గా ఎంపికవ్వడంపై, అలాగే సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గురించి గిల్ మాట్లాడాడు. మరి గిల్ ఏమన్నాడంటే?

అలాంటివాళ్లు చాలా అరుదు
'టీమ్ఇండియా డ్రెస్సింగ్‌ రూమ్‌లో అప్పటి కెప్టెన్ రోహిత్ శర్మ స్నేహపూర్వక వాతావరణం సృష్టించాడని, తాను కూడా అదే విధానాన్ని కొనసాగిస్తానని గిల్ అన్నాడు. రోహిత్‌ భాయ్ చాలా ప్రశాంతంగా ఉంటాడు. కెప్టెన్​గా ఉంటూ జట్టులో నెలకొల్పిన స్నేహపూరిత వాతావరణాన్ని నేను కూడా కొనసాగిస్తా. అది రోహిత్ భాయ్ నుంచి వారసత్వంగా తీసుకుంటాను. విరాట్ భాయ్, రోహిత్ భాయ్ టీమ్ఇండియా అనేక విజయాల్లో కీలక పాత్ర పోషించారు. అలాంటి ప్లేయర్లు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి స్క్రిల్స్, క్వాలిటీ గేమ్, ఎక్స్​పీరియన్స్ ఉన్న వాళ్లు ప్రపంచంలో తక్కువ మంది క్రికెటర్లు ఉంటారు. 2027 వరల్డ్​కప్​లో వాళ్లిద్దరినీ కచ్చితంగా చూస్తామని నమ్మకంగా ఉన్నాం' అని గిల్ అన్నాడు.

ప్రస్తుతం గిల్ వన్డే, టెస్టు ఫార్మాట్లకు కెప్టెన్​గా ఉన్నాడు. టీ20లకు సూర్యకుమార్ యాదవ్ సారథ్యం వహిస్తున్నాడు. అయితే భవిష్యత్​లో పొట్టి ఫార్మాట్ బాధ్యతలు కూడా గిల్​కే దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాను ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. 'ఇది ఓ గౌరవంగా భావిస్తున్నాను. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేం. నేను కూడా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. అయితే, నేనెప్పుడూ వర్తమానంలో ఉండేందుకే ఇష్టపడతాను. అలాగే గతంలో ఏం సాధించాననేది కాదు. ప్రతీ మ్యాచ్‌లో గెలవాలనేదే టార్గెట్​తోనే ముందుకు వెళ్తాం. రాబోయే కొన్ని నెలలు మాకు అత్యంత కీలకం' అని గిల్ కెప్టెన్సీపై మాట్లాడాడు.

కాగా, అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో భారత్ వన్డే, టీ20 సిరీస్​లు ఆడనుంది. ఈ పర్యటనలో ముడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్​లు ఆడాల్సి ఉంది. అయితే ఈ వన్డే సిరీస్ నేపథ్యంలో సెలక్టర్ ఇటీవల రోహిత్​ను కెప్టెన్సీ నుంచి తప్పించారు. ఆ బాధ్యతలు యంగ్ కెప్టెన్ గిల్​కు అప్పగించారు. శ్రేయస్ అయ్యర్​ను వైస్ కెప్టెన్​గా ఎంపిక చేశారు. ఇక రోహిత్ ఆసీస్ సిరీస్​లో బ్యాటర్​గానే బరిలోకి దిగుతాడు.

ఆసీస్ సిరీస్​కు ఎంపికైన భారత్ వన్డే జట్టు
శుభ్​మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, నితీశ్​కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, సిరాజ్, అర్ష్‌ దీప్, ప్రసిద్ధ్‌ కృష్ణ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), యశస్వీ జైస్వాల్

టీ20 జట్టు
సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభ్​మన్ గిల్ (వైస్‌ కెప్టెన్), నితీశ్​కుమార్‌ రెడ్డి, శివమ్ దూబె, అక్షర్ పటేల్, జితేశ్‌ శర్మ (వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌ దీప్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, సంజు శాంసన్, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్.

కెప్టెన్సీ కోల్పోయిన హిట్​మ్యాన్- రోహిత్ జీతంలో BCCI కోత విధిస్తుందా? రూల్స్ ఏం చెబుతున్నాయి?

ఆసీస్ సిరీస్​లో రోహిత్ ముంగిట ఏడు రికార్డులు- ప్రపంచంలోనే తొలి బ్యాటర్​గా నిలిచే ఛాన్స్!