ETV Bharat / sports

రోహిత్ శర్మ, పుజారాపై వెస్టిండీస్​లో ఎటాక్- అసలు ఏం జరిగిందంటే? - IND VS WI 2012

టీమ్ఇండియాపై వెస్టిండీస్​లో ఎటాక్- ఆ రోజు ఏమైందంటే?

Team India In West Indies
Team India In West Indies (Source : Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : June 7, 2025 at 8:35 PM IST

2 Min Read

Attack On Team India In West Indies : టీమ్ఇండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, ఛెతేశ్వర్ పుజారా ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. 2012లో భారత్ ఎ తరఫున వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లినప్పుడు తమకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని తాజాగా గుర్తు చేసుకున్నారు. ఛెతేశ్వర్ పుజారా సతీమణి పూజ ది డైరీ ఆఫ్‌ ఎ క్రికెటర్స్ వైఫ్‌ పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకాన్ని రోహిత్ రీసెంట్​గా ఆవిష్కరించాడు. ఈ సందర్భంగా రోహిత్, పుజారా 2012లో వెస్టిండీస్‌ టూర్‌ విషయాలు షేర్ చేసుకున్నారు.

నాకు తెలిసి ఈ సంఘటన బుక్‌లో రాసినట్టు లేరు. 2012లో టీమ్‌ఇండియా ఎ వెస్టిండీస్‌ టూర్‌కు వెళ్లినప్పుడు ఏం జరిగింది? ఆ విషయాలు రాశారా? అని పుజారాను రోహిత్‌ ప్రశ్నించాడు. నేను ఏం చెప్పలేదు. ఈ ఘటన గురించి అవగాహన ఉంది. కానీ, అక్కడ ఏం జరిగింది అనే వివరాలు పూర్తిగా రాయలేదు అని పుజారా బదులిచ్చాడు. అయితే ఆ రోజు ఏం జరిగిందనేది పుజారా గుర్తు చేసుకున్నాడు.

నేను శాకాహారిని. అందుకే ఏదైనా వెజ్ ఫుడ్​ దొరుకుతుందేమో అని రాత్రి సమయంలో బయటకు వెళ్లాం. అది ట్రినిడాడ్ అండ్ టొబాగో ఏరియా. రాత్రి 11 గంటలు అయ్యింది. మాకు మాత్రం ఎలాంటి భోజనం కనిపించలేదు. దీంతో మేం వెనక్కి తిరిగి వస్తున్నాం. ఆ సమయంలో మాపై ఒక అటాక్‌ జరిగింది. దాని గురించి పూర్తిగా చెప్పలేను. మొత్తం మీద జరిగిన స్టోరీ అయితే అదే అని పుజారా వివరించాడు.

వెళ్లొద్దని చెప్పా!
పుజారా తర్వాత అప్పటి సంఘటనను రోహిత్ కూడా గుర్తుచేశాడు. ఆ సంఘటన తర్వాత రాత్రి సమయంలో బయటకి వెళ్లవద్దని పుజారాకు చెప్పినట్లు గుర్తుచేసుకున్నాడు. ఈ ఘటన జరిగిన తర్వాత రాత్రివేళ బయటకు వెళ్లొద్దని పుజారాకు చెప్పాం. మరీ ముఖ్యంగా రాత్రి 9గంటల తర్వాత వెళ్లొద్దని హెచ్చరించాం. ఎందుకంటే ఇది వెస్టిండీస్ అని ఆ నాటి సంగతిని రోహిత్ గుర్తు చేసుకున్నాడు.

ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కిన పుజారా- తొలి టెస్టు కోసమే!

'264 కొట్టినా నాన్న మెచ్చుకోలేదు- ఆ విషయంలో చాలా ఫీలయ్యారు!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.