ETV Bharat / sports

చరిత్ర సృష్టించిన SRH​- 12ఏళ్లలో తొలి విజయం - IPL 2025

గెలుపు ట్రాక్ ఎక్కిన సన్​రైజర్స్- చెన్నైపై ఘన విజయం

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Sports Team

Published : April 25, 2025 at 11:16 PM IST

Updated : April 25, 2025 at 11:35 PM IST

2 Min Read

SRH VS CSK IPL 2025 సన్​రైజర్స్​ హైదరాబాద్ ఎట్టకేలకు మళ్లీ గెలుపు బాట పట్టింది. 2025 ఐపీఎల్​లో మూడో విజయం నమోదు చేసింది. శుక్రవారం చెపాక్​లో చెన్నై సూపర్ కింగ్స్​తో జరిగిన మ్యాచ్​లో 5 వికెట్ల తేడాతో నెగ్గింది. 155 పరుగుల టార్గెట్​ను సన్​రైజర్స్ 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇషాన్ కిషన్ (44 పరుగులు), కమిందు మెండీస్ (30 పరుగులు) రాణించారు. చివర్లో నితీశ్ రెడ్డి (19) ఆకట్టుకున్నాడు. నూర్ అహ్మద్ 2, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కంబోజ్, జడేజా తలో 1 వికెట్ దక్కించుకున్నారు.

టార్గెట్ చిన్నదే అయినా ఛేదనలో సన్​రైజర్స్​ బాగా కష్టపడింది. రెండో బంతికే అభిషేక్ శర్మ (0) డకౌట్ అయ్యాడు. వన్​ డౌన్​లో వచ్చిన ఇషాన్​తో హెడ్ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. ఆరో ఓవర్లో హెడ్ (19), 8.1 వద్ద క్లాసెన్​ (7) వరుసగా పెవిలియన్ చేరడం వల్ల సన్​రైజర్స్ కష్టాల్లో పడింది. ఈ దశలో ఇషాన్ ఆచితూచి ఆడాడు. కీలక ఇన్నింగ్స్​తో జట్టును విజయం దిశగా నడిపించాడు. తర్వాత ఇషాన్, అనికేత్ (19) ఔటైనా చివర్లో మెండిస్, నితీశ్ ఆట పూర్తి చేశారు.

12ఏళ్లలో తొలిసారి
కాగా, సన్​రైజర్స్ ఈ మ్యాచ్​తో అరుదైన ఘతన సాధించింది. 12ఏళ్ల తర్వాత చెన్నైను తమ సొంతగడ్డ చెపాక్​లో ఓడించడం ఇదే తొలిసారి. ఇక తాజా విజయంతో సన్​రైజర్స్​ ఫ్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఆరు పాయింట్లతో పట్టికలో ఎనిమిదో స్థానానికి వెళ్లింది. అటు సీజన్​లో చెన్నై ఏడో ఓటమి మూటగట్టుకుంది. ఈ ఓటమితో సీఎస్కే ప్లే ఆఫ్ రేస్​ నుంచి దాదాపు నిష్క్రమించినట్లే!

అంతకుముందు బ్యాటింగ్ చేసిన చెన్నై 19.5 ఓవర్లలో 154 పరుగులకు ఆలౌటైంది. డివాల్డ్ బ్రేవిస్ (42 పరుగులు), ఆయూష్ మాత్రె (30 పరుగులు) రాణించారు. జడేజా (21), శివమ్ దూబే (12), దీపక్ హుడా (22 పరుగులు), ధోనీ (6) విఫలమయ్యారు. పూర్తిగా బౌలర్లకు సహకరించిన పిచ్​పై పరుగులు చేయడం కష్టంగా మారింది. బ్రెవిస్ మెరుపులు, చివర్లో హుడా వల్ల చెన్నై 150 మార్క్ దాటగలిగింది. సన్​రైజర్స్ బౌలర్లలో హర్షల్ పటేల్ 4 వికెట్లతో సత్తా చాటాడు. కమిన్స్, ఉనాద్కత్​తు చెరో 2, షమీ, మెండీస్ తలో 1 వికెట్ దక్కించుకున్నారు.

SRH ప్లేఆఫ్ల్ ఛాన్స్​లు- డోంట్​వర్రీ ఫ్యాన్స్​ అలా చేస్తే మనం టాప్​లోకే!

ఉత్కంఠ పోరులో ఆర్సీబీ విజయం- జైస్వాల్, జురెల్ పోరాటం వృథా

Last Updated : April 25, 2025 at 11:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.