ETV Bharat / sports

'గురూజీ నీతోనే ఉండిపోవాలని ఉంది'- రూమర్ గర్ల్​ఫ్రెండ్​తో గబ్బర్ ఇన్​స్టా రీల్! - SHIKHAR DHAWAN REELS

గబ్బర్ ఈజ్ బ్యాక్- గర్ల్​ఫ్రెండ్​తో రీల్ చేసిన ధావన్!

Shikhar Dhawan New Reel
Shikhar Dhawan New Reel (Source : Dhawan Insta Reel)
author img

By ETV Bharat Sports Team

Published : April 12, 2025 at 8:25 PM IST

2 Min Read

Shikhar Dhawan New Girl Friend : టీమ్ఇండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్- ఐర్లాండ్‌కు చెందిన సోఫీ షైన్‌తో ధావన్ లవ్​లో ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఆమెతో గబ్బర్ కలిసి ఉన్న ఫొటోలు కూడా ఇటీవల సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. ఈ నేపథ్యంలో ధావన్ తాజాగా ఆమెతో రీల్స్ చేశాడు. ఈ వీడియోను తన ఇన్​స్టాగ్రామ్​ ఆకౌంట్​లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ రీల్ ట్రెండ్ అవుతోంది.

'గబ్బర్ ఈజ్ బ్యాక్' అని పోస్ట్​కు క్యాప్షన్ రాసుకొచ్చాడు. ఓ హిందీ సినిమాలోని డైలాగ్​కు ధావన్- సోఫీ రీల్ చేశారు. 'గురూజీ ఇక్కడి నుంచి వెళ్లాలని లేదు. నేను నీతోనే ఉండాలని కోరుకుంటున్నా' అని అమ్మాయి అడగ్గా, 'ఇంట్లో పని చేసేందుకు వస్తావా?' అంటూ ధావన్ ఆమెతో ఫన్నీగా డైలాగ్ చెబుతాడు. అంతే ఇక ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. గబ్బర్ భాయ్ రిలేషన్​షిప్ అనౌన్స్​ చేసేశాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

కాగా, ఇటీవల ధావన్ ప్రేమ, పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తను ఎల్లప్పుడూ లవ్​లోనే ఉంటానని అన్నాడు. 'నేను రిలేషన్ షిప్​లో ముందుకు వెళ్తున్నా. ప్రేమించడంలో నేను దురదృష్టవంతుడిని కాను. లవ్​లో ఇప్పుడు నాకు అనుభవం ఉంది. అదే మంచి ప్రేమను ఎంచుకునేందుకు ఉపయోగపడుతుంది. లవ్ లో మంచి, చెడు సందర్భాలు రెండూ ఉన్నాయి. నేను వాటన్నింటికీ విధేయుడిని' అని ధావన్ రీసెంట్​గా ఓ సందర్భంలో వ్యాఖ్యానించాడు.

గతంలో పెళ్లి, విడాకులు
ఆస్ట్రేలియాకు చెందిన బాక్సర్‌ ఆయేషా ముఖర్జీని ధావన్‌ 2012లో పెళ్లాడాడు. మనస్పర్థలు రావడం వల్ల కొంతకాలం దూరంగా ఉన్న వీరు తాము విడిపోతున్నట్లు 2021లో వెల్లడించారు. ఈ క్రమంలోనే తన భార్య మానసికంగా వేధిస్తోందని ఆరోపిస్తూ ధావన్‌ దిల్లీలోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం అప్లై చేసుకున్నాడు. గతేడాది వీరికి విడాకులు మంజూరు అయ్యాయి. అయితే ఐర్లాండ్‌ కు చెందిన సోఫీ షైన్‌ తో ధావన్ డేటింగ్ చేస్తున్నాడని ఇటీవల కాలంలో వార్తలు వచ్చాయి. వాటికి గబ్బర్ తాజాగా వివరణ ఇచ్చాడు.

ప్రేమ, పెళ్లిపై ధావన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్- గబ్బర్​ మళ్లీ లవ్​లో పడ్డాడోచ్?

'ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో రోహిత్​కు బాగా తెలుసు!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.