Shardul Thakur IPL 2025 : ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ పేస్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ అదరగొట్టాడు. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ బ్యాటర్లకు శార్దూల్ కట్టుదిట్టంగా బంతులేస్తూ అడ్డుకట్ట వేశాడు. ఈ మ్యాచ్‌లో తన 4 ఓవర్ల స్పెల్‌లో మొత్తం 34 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.
ఆరంభంలోనే షాక్
డేంజర్ బ్యాటింగ్ లైనప్ ఉన్న సన్‌రైజర్స్‌కు ఆరంభంలోనే షాకిచ్చాడు. మూడో ఓవర్లో తొలి రెండు బంతులకు అభిషేక్ శర్మ (6 పరుగులు), ఇషాన్ కిషన్ (0) ను వరుసగా పెవిలియన్ చేర్చి లఖ్‌నవూకు బిగ్ బ్రేక్ ఇచ్చాడు. శార్దూల్ విజృంభించడం వల్ల సన్‌రైజర్స్ 2.2 ఓవర్లలో 15 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయింది. ఇక చివర్లో అభినవ్ మనోహర్ (2), మహ్మద్ షమీను ఔట్ చేశాడు.
పర్పుల్ క్యాప్!
దీంతో శార్దూల్ టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలిచాడు. రెండు మ్యాచ్‌ల్లో కలిపి శార్దూల్ 6 వికెట్లు నేలకూల్చి, ప్రస్తుతం టోర్నీలో టాప్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. దీంతో శార్దూల్‌కు పర్పుల్ క్యాప్ దక్కింది. కాగా, రీసెంట్గా దిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లోనూ శార్దూల్ ఆకట్టుకున్నాడు. రెండు ఓవర్లలో 2 వికెట్లు దక్కించుకున్నాడు.
SHARDUL STRIKES! 🔥
— Star Sports (@StarSportsIndia) March 27, 2025
The dangerous #AbhishekSharma falls into the trap as he gets caught at fine leg off #ShardulThakur’s clever delivery!
Watch LIVE action: https://t.co/f9h0ie1eiG #IPLonJioStar 👉 #SRHvLSG | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi & JioHotstar! pic.twitter.com/hx4H3wO2EN
అనుకోకుండా వచ్చి!
అయితే గతేడాది జరిగిన మెగా వేలంలో శార్దూల్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. దీంతో అతడు అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. కాగా, ఈ టోర్నీ ప్రారంభానికి ముందు మెహ్సిన్ ఖాన్ గాయంతో జట్టు నుంచి తప్పుకోవడం వల్ల శార్దూల్‌కు లఖ్‌నవూ తరఫున ఆడే అవకాశం దక్కింది. అలా జట్టులోకి వచ్చిన శార్దూల్ అవకాశాల్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. అనుకోకుండా టోర్నీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు ఏకంగా పర్పుల్ క్యాప్ దక్కించుకోవడంతో శార్దూల్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇక ఈ మ్యాచ్‌లో శార్దూల్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ కెరీర్లో 100 వికెట్ల క్లబ్లో చేరిపోయాడు. ఇప్పటివరకు 97 మ్యాచ్‌లు ఆడిన శార్దూల్ 100 వికెట్లు పూర్తి చేసుకున్నాడు.
SHARDUL THAKUR - PURPLE CAP HOLDER AFTER BEING UNSOLD. 🥶 pic.twitter.com/CubMyG2WSK
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 27, 2025
లఖ్‌నవూతో మ్యాచ్- అప్పటి విధ్వంసం గుర్తుందా?- ఉప్పల్‌లో మళ్లీ సునామీనే!
SRH బ్యాటర్ల స్టైక్ రేట్ దెబ్బకు ఆకాశ్ చోప్రా మైండ్ బ్లాంక్! సన్‌రైజర్స్‌ను ఓడించాలంటే అలా చేయాలట!