IPL 2025 Retirement : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సీజన్ 18 మరో 2 రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే ఐపీఎల్‌లో ప్రతి సీజన్‌లో కొంతమంది ప్లేయర్లు అరంగేట్రం చేస్తుంటారు. మరికొందరు రిటైర్ అవుతుంటారు. అలా ప్రారంభ సీజన్ నుంచి ఇప్పటికీ ఆడుతున్న ప్లేయర్లు కొందరు ఉన్నారు. ఆయా టీమ్‌లలో సూపర్ స్టార్‌లుగా కొనసాగుతున్నారు. అయితే ప్రస్తుత ఐపీఎల్ సీజన్ పూర్తయ్యాక కొందరు టాప్ ప్లేయర్లు రిటైర్మెంట్ ప్రకటిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.అలానే మరి కొందరికి మరో అవకాశం లభించకపోవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ లిస్టులో ఉన్న ప్లేయర్ల గురించి ఇప్పుడు చూద్దాం.
ఎంఎస్ ధోనీ (CSK) : 2008 నుంచి ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరఫున ఆడుతున్నాడు. సుదీర్ఘ కాలం కెప్టెన్‌గా వ్యవహరించాడు.ఏకంగా ఐదు టైటిల్స్ అందించాడు. 2024 సీజన్‌కి ముందు కెప్టెన్సీ వదులుకున్నాడు. ఇప్పటి వరకు 229 మ్యాచుల్లో 39.13 యావరేజ్‌తో 137.54 స్ట్రైక్ రేట్‌తో 5,200 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. ఇప్పటికే అనేక సార్లు ధోనీ ఐపీఎల్ వదిలేస్తున్నాడనే ప్రచారం జరిగింది. కానీ, 2025లో కూడా ధోని ఆడబోతున్నాడు. అయితే ఇదే చివరికి సీజన్ అనే ఊహాగానాలు పెరుగుతున్నాయి.
మొయిన్ అలీ (KKR) : గతేడాది మొయిన్ అలీ(38) అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తరఫున ఐపీఎల్ బరిలో దిగుతున్నాడు. ఇటీవల కాలంలో మొయిన్ టీ20 ఫార్మాట్లో పెద్దగా రాణించలేకపోయాడు. దీంతో రాబోయే వేలంలో అతడిని కొనడానికి ఫ్రాంచైజీలు ఆసక్తి చూపకపోవచ్చు. ఇదే మొయిన్‌కి చివరి ఐపీఎల్ కావచ్చని భావిస్తున్నారు.
రవిచంద్రన్ అశ్విన్ (CSK) : మెగా వేలంలో సీఎస్కే అశ్విన్ (38)ను రూ.9.75 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే అశ్విన్ 2024లో ఆకట్టుకోలేకపోయాడు. 14 మ్యాచుల్లో 51.89 యావరేజ్‌తో తొమ్మిది వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. అశ్విన్ ఈ సీజన్‌లో కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోతే, ఇదే అతడి చివరి IPL సీజన్ కావచ్చు.
గ్లెన్ మ్యాక్స్‌వెల్(PBKS) : ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్(36) గత సీజన్‌లో దారుణంగా విఫలమయ్యాడు. కేవలం 52 పరుగులు మాత్రమే చేశాడు. ఫిట్‌నెస్ సమస్యలతో ఇబ్బంది పడ్డాడు. అతడు ఐపీఎల్‌లో కొనసాగాలంటే ఈ సీజన్‌లో కచ్చితంగా మంచి ప్రదర్శన చేయాలి. ఈ సారి కూడా ఆకట్టుకోకపోతే మరో అవకాశం లభించడం కష్టమే.
ఫాఫ్ డుప్లెసిస్ (DC) : ఫాఫ్ డుప్లెసిస్(40) ఐపీఎల్‌లో స్థిరంగా రాణిస్తున్నాడు. 35.99 యావరేజ్, 136.37 స్ట్రైక్ రేట్‌తో 4,521 పరుగులు చేశాడు. అయితే గత సీజన్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. 10 ఇన్నింగ్స్‌ల్లో 28.6 యావరేజ్‌తో ఆడాడు. ఈసారి దిల్లీ క్యాపిటల్స్ (DC) తరఫున ఆడుతున్నాడు. కెరీర్ కొనసాగాలంటే బలమైన ప్రదర్శన ఇవ్వాలి.
ఇతర ఆటగాళ్లు
ఈ జాబితాలో స్పిన్నర్ కరణ్ శర్మ, ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ పేర్లు కూడా ఉన్నాయి. కొన్నేళ్లుగా ఐపీఎల్‌లో ఈ సీనియర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నారు. ఈసారి కరణ్ శర్మ ముంబయి ఇండియన్స్‌కి ఆడుతున్నాడు. ఇషాంత్ శర్మ గుజరాత్ టైటాన్స్ తరఫున బరిలో దిగుతున్నాడు. ఇద్దరూ ఈ సీజన్‌లో బలమైన ప్రదర్శన చేయకపోతే మరో అవకాశం రాకపోవచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
Year. Long. Wait. 🥺✨#WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/CSigQbzMes
— Chennai Super Kings (@ChennaiIPL) February 28, 2025
'అంపైర్'గా విరాట్ టీమ్మేట్- తొలి క్రికెటర్‌గా ఆ వరల్డ్‌కప్ హీరో రికార్డ్
ముంబయికి ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్- పాండ్య ప్లేస్‌లో ఎవరంటే?