Funny Run Out In Cricket : క్రికెట్ చరిత్రలోనే అత్యంత హాస్యాస్పదకరమైన సంఘటన జరిగింది. ఫీల్డింగ్ జట్టు చేసిన తప్పిదాలకు ఈజీగా రనౌట్ అవ్వాల్సిన బ్యాటర్లిద్దరూ తప్పించుకున్నారు. బ్యాటర్లిద్దరూ క్రీజు మధ్యలోనే ఒకరినొకరు ఢీ కొట్టుకొని పడిపోయినప్పటికీ, ఫీల్డింగ్ టీమ్ వాళ్లను రనౌట్ చేయలేకపోయింది. ఫలితంగా బ్యాటింగ్ టీమ్‌కు ఇంకో పరుగు కూడా వచ్చింది. గల్లీ క్రికెట్ కంటే పేలవ ఫీల్డింగ్ కనబర్చిన ఈ సంఘటన ఏ మ్యాచ్‌లో జరిగిందంటే?
మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో భాగంగా రీసెంట్గా కొల్హాపుర్ టస్కర్స్- రాయ్‌గఢ్ రాయల్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కొల్హాపుర్ టస్కర్స్ ఫీల్డింగ్ క్రికెట్ అభిమానులకు నవ్వు తెప్పించింది. రాయ్‌గఢ్ బ్యాటర్ విక్కీ ఓస్తల్, ఓ ఓవర్లో ఆత్మన్ పోరె వేసిన బంతిని బ్యాక్ ఫుట్‌లో డిఫెన్స్ ఆడాడు. బంతి ఇద్దరు ఫీల్డిర్ల మధ్యలోంచి కవర్స్ దిశగా వెళ్లింది. దీంతో విక్కీ పరుగు తీయడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే ఒక పరుగు పూర్తి అయ్యింది.
అయితే రెండో పరుగు కోసం ప్రయత్నిస్తున్న దశలో బ్యాటర్లిద్దరూ పిచ్ మధ్యలోకి రాగానే ఒకరినొకరు బలంగా ఢీ కొట్టుకున్నారు. దీంతో కిందపడిపోయారు. ఆ సమయంలో బంతి కీపర్ చేతుల్లోకి వచ్చింది. వెంటనే కీపర్ స్టంప్స్‌ను గిరాటేసి ఉంటే, స్టైకింగ్‌లో ఉన్న బ్యాటర్ విక్కీ ఔటయ్యేవాడే. కానీ, కీపర్ బంతిని నాన్‌స్టైక్ వైపు ఉన్న బౌలర్‌కు విసిరాడు. ఈలోపే కిందపడ్డ బ్యాటర్ లైన్ లోపలికి వచ్చేశాడు.
అటువైపు మరో బ్యాటర్ అలాగే కింద పడి ఉన్నాడు. వెంటనే ఫీల్డింగ్ జట్టులోని మరో అటగాడు బంతిని అందుకొని స్టైకింగ్ వైపు బ్యాటర్‌ను రనౌట్ చేయడానికి పరిగెత్తాడు. ఇంతలోనే కిందపడి ఉన్న మరో బ్యాటర్ లేచి, బ్యాట్ అక్కడే వదిలేసి మరీ పరుగెత్తాడు. ఈ క్రమంలో ఫీల్డర్ వికెట్లకు అతి దగ్గర నుంచి త్రో విసిరినా అది స్టంప్స్‌కు తగలలేదు. ఆలోపు బ్యాటర్ లైన్లోకి వచ్చేశాడు. దీంతో రెండో పరుగు కూడా పూర్తైంది.
BOTH BATTERS COLLIDED IN BETWEEN.
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 21, 2025
RUN OUT MISSED AT NON STRIKER'S END.
RUN OUT MISSED AT STRIKER'S END.pic.twitter.com/EQoro8GoYd
సింపుల్‌గా చెప్పాలంటే
- ఇద్దరు బ్యాటర్లు రన్ తీస్తుండగా ఒకరినొకరు ఢీ కొట్టుకున్నారు
- ఈ క్రమంలో నాన్‌స్టైకర్ ఎండ్‌లో రనౌట్ మిస్ అయ్యింది
- స్టైకింగ్‌లో ఉన్న బ్యాటర్‌ను రనౌట్ చేయడానికి చూడగా అది కూడా తప్పింది
ఈ సంఘటన క్రికెట్ లవర్స్‌కు నవ్వు తెప్పిస్తోంది. ఇది గల్లీ క్రికెట్ అనుకున్నారమో అంటుూ కామెంట్స్ పెడుతున్నారు. మరోవైపు ప్లేయర్లు ఒకరినొకరు ఢీ కొట్టుకొని కింద పడిపోతే, వాళ్లను పలకరించాల్సింది పోయి రనౌట్‌కు ప్రయత్నం చేయడాన్ని మరికొందరు తప్పుబడుతున్నారు. ఫీల్డింగ్ జట్టుకు స్పోర్ట్స్‌మెన్‌షిప్ లేదంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
'ఇలా కూడా రనౌట్ అవుతారా?- గల్లీ క్రికెట్ అనుకున్నారా బాబు?'