ETV Bharat / sports

బెంగళూరు ఆల్​రౌండ్ షో- రాజస్థాన్​పై ఈజీ విన్ - IPL 2025

రాజస్థాన్​పై బెంగళూరు ఈజీ విన్- రాణించిన సాల్ట్, విరాట్

RR vs RCB IPL
RR vs RCB IPL (Source : Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : April 13, 2025 at 6:50 PM IST

2 Min Read

RCB vs RR IPL 2025 : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మళ్లీ గెలుపు ట్రాక్ ఎక్కింది. ఆదివారం రాజస్థాన్ రాయల్స్​తో జరిగిన మ్యాచ్​లో ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో నెగ్గింది. రాజస్థాన్ నిర్దేశించిన 174 పరుగులు లక్ష్యాన్ని ఆర్సీబీ 17.3 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి ఛేదించింది. ఫిల్ సాల్ట్ (65), విరాట్ కోహ్లీ (62*) హాఫ్ సెంచరీలతో అదకగొట్టారు. పడిక్కల్ (40*) రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో కుమార్ కార్తికేయకు 1 వికెట్ దక్కింది.

ఛేజింగ్​లో ఆర్సీబీకి మంచి ఆరంభం లభించింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఎడాపెడా బౌండరీలతో రెచ్చిపోయాడు. దీంతో ఆర్సీబీ పవర్​ ప్లే ముగిసేసరికి 65-0తో నిలిచింది. ఈ క్రమంలోనే సాల్ట్ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అయితే 8.4 ఓవర్ వద్ద సాల్ట్ భారీ షాట్​కు ప్రయత్నించి క్యాచౌట్​గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన పడిక్కల్​తో కలిసి విరాట్ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. ఈ క్రమంలోనే విరాట్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇక రాజస్థాన్​కు మరో ఛాన్స్ ఇవ్వకుండా ఈ ఇద్దరే మ్యాచ్​ను ముగించేశారు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన రాజస్థాన్​కు కూడా ఇన్నింగ్స్​ను అద్భుతంగానే ప్రారంభించింది. కెప్టెన్ శాంసన్ (15) ఔటైనప్పటికీ రియాన్ పరాగ్ (30)తో కలిసి యశస్వీ జైస్వాల్ (75) సూపర్ హాఫ్ సెంచరీతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. దీంతో 13 ఓవర్లకే రాజస్థాన్ స్కోర్ 100 దాటింది. కానీ ఆ తర్వాత ఆర్సీబీ బౌలర్లు పుంజుకున్నారు. వరుస వికెట్లు తీస్తూ, కట్టుదిట్టమైన బంతులేస్తూ పరుగులు నియంత్రించారు.

పరాగ్​ను యశ్ దయాల్ ఔట్ చేయగా, జైస్వాన్​ను హేజిల్​వుడ్ పెవిలియన్ చేర్చాడు. హెట్​మయర్ (9) కూడా విఫలమయ్యాడు. అతడిని భువనేశ్వర్ బోల్తా కొట్టించాడు. చివర్లో ధ్రువ్ జురెల్ (35*) పోరాడడం వల్ల ఆ మాత్రం స్కోరైన వచ్చింది. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్, యశ్ దయాల్, హేజిల్​వుడ్, కృనాల్ తలో 1 వికెట్ దక్కించుకున్నారు.

RCB డేంజర్ బౌలర్​ రెడీ- ఇక చెన్నైకి దబిడి దిబిడేనా?

RCB గ్రాండ్ విక్టరీ- రఫ్పాడించిన విరాట్, సాల్ట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.