RCB Replacement IPL 2025 : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు అదిరే న్యూస్. 17పాయింట్లతో ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన ఆర్సీబీ, ఈసారి ఛాంపియన్‌గా నిలవడమే టార్గెట్‌గా పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే జట్టులో కీలక మార్పు చేసింది. టీ 20 స్పెషలిస్ట్‌ను రంగంలోకి దింపింది. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరంటే?
ఐపీఎల్ పునః ప్రారంభమైన తర్వాత ఇంగ్లాండ్ ప్లేయర్ జకాబ్ బెతెల్ భారత్‌కు వచ్చాడు. కానీ, అతడు ప్లేఆఫ్స్‌కు అందుబాటులో ఉండడం లేదు. మే 29న ఇంగ్లాండ్- వెస్టిండీస్ వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ నేపథ్యంలో బెతెల్ మళ్లీ తన స్వదేశం వెళ్లనున్నాడు. ఈ కారణంగా ఐపీఎల్ ప్లేఆఫ్స్‌కు దూరం కానున్నాడు. దీంతో ఆర్సీబీ అతడి రిప్లేస్మెంట్ ప్రకటించింది. బెతెల్ స్థానంలో న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ టిమ్ సీఫెర్డ్ను తీసుకున్నట్లు గురువారం వెల్లడించింది.
రూ.2కోట్లకు డీల్
ఆర్సీబీకి టిమ్ సీఫెర్డ్తో రూ.2 కోట్లకు అగ్రిమెంట్ కుదిరింది. అతడు మే 24 తర్వాత జట్టుతో చేరనున్నాడు. ఈ సీజన్లో ఆర్సీబీ మే 23న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచే బెతెల్‌కు ఆఖరిది. ఆ తర్వాత బెతెల్ స్థానంలో సీఫెర్డ్ రానున్నాడు. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో మే 27న ఆర్సీబీ లీగ్‌లో తమ చివరి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో సీఫెర్డ్ బరిలో దిగే ఛాన్స్ ఉంది.
కాగా, ఇప్పటి దాకా 66 టీ20లు ఆడిన సీఫెర్డ్ 142.86 స్ట్రైక్ రేట్‌తో 1540 పరుగులు చేశాడు. ఇందులో 80 సిక్స్‌లు ఉండడం విశేషం. ఈ ఏడాది ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. 2025లో సీఫెర్డ్ 5 మ్యాచ్‌లు ఆడగా 207.50 స్టైక్ రేట్‌తో 249 పరుగులు చేశాడు. ఇక సీఫెర్డ్ 2021లోనే ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. 2021- 22 రెండు సీజన్లలో కలిపి కోల్‌కతా నైట్‌రైడర్స్, దిల్లీ క్యాపిటల్స్ తరఫున మూడు మ్యాచ్‌లు ఆడాడు.
When firepower meets form, we get an absolutely destructive combo. 🔥
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 22, 2025
Tim's ready to take off, and WE. CAN. NOT. WAIT! 🙌#PlayBold #ನಮ್ಮRCB #IPL2025 pic.twitter.com/OFQ2j1qb8R
ఆర్సీబీ మ్యాచ్ వేదిక మార్పు
మే 23న బెంగళూరు చిన్నస్వామి వేదికగా ఆర్సీబీ- సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉంది. దీంతో ఈ మ్యాచ్‌ను లఖ్‌నవూ ఎకాన స్టేడియానికి తరలించారు.
ముంబయి ఇండియన్స్ మాస్టర్ ప్లాన్- టీమ్‌లోకి ముగ్గురు స్టార్ ప్లేయర్లు
ముంబయి, RCBకి షాక్- ఏడుగురు ప్లేయర్లు ఔట్- బ్యాడ్ లక్ అంటే మీదే బ్రో!