Rohit Sharma Captaincy : 'కంటెంట్ ఉన్నోడు డగౌట్లో కూర్చున్నా సరే, మ్యాచ్ ఫలితాన్ని మార్చేస్తాడు' అనే డైలాగ్ రోహిత్ శర్మకు సరిగ్గా సెట్ అవుతుందేమో! ఆదివారం దిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో సరిగ్గా ఇదే జరిగింది. విజయం దిశగా దూసుకుపోతున్న దిల్లీకి, మాస్టర్‌మైండ్ రోహిత్ శర్మ తన కెప్టెన్సీ అనుభవంతో డగౌట్లో కూర్చొనే చెక్ పెట్టాడు. ఫలితంగా మ్యాచ్ ముంబయివైపు తిరిగింది.
206 పరుగులు లక్ష్య ఛేదనను దిల్లీ ఘనంగానే ఆరంభించింది. ఇక చివరి 30 బంతుల్లో విజయానికి 48 పరుగులు కావాలి. క్రీజులో కేఎల్ రాహుల్, అశుతోష్ శర్మ ఉన్నారు. ఈ దశలో దిల్లీ ఈజీగా గెలిచేస్తుందని అందరూ అంచనా వేశారు. కానీ, అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది. డగౌట్లో కూర్చొని ఉన్న రోహిత్ కోచ్ జయవర్దనే, పరాస్ మాంబ్రేతో మాట్లాడి లెగ్ స్పిన్నర్‌తో బౌలింగ్ చేయించి ఫలితం రాబట్టవచ్చని సలహా ఇచ్చాడు . వెంటనే ఆ ఓవర్ కర్ణ్ శర్మతోనే చేయించాలని అక్కడి నుంచే కెప్టెన్ హార్దిక్‌కు సైగ చేశాడు.
This was the moment where MI turned back the game. 🙌💙
— Indian Cricket Team (@incricketteam) April 13, 2025
Rohit Sharma the unsung Leader 👑#DCvsMI | #RohitSharma | #MIvsDC pic.twitter.com/vjuW0CkKQu
16వ ఓవర్లో బంతి అందుకున్న కర్ణ్ తొలి రెండు బంతుల్లో రెండు సింగిల్సే ఇచ్చాడు. ఇక మూడో బంతిని టాస్ వేయగా క్రీజులో ఉన్న రాహుల్ స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంచి బ్యాట్ అంచున తాకి అమాంతం అక్కడే గాల్లోకి లేచింది. చురుగ్గా స్పందించిన కర్ణ్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో దిల్లీ ఆరో వికెట్ కోల్పోయింది. అంతే మ్యాచ్ అక్కడే ముంబయి వైపు తిరిగింది. ఇక చివర్లో ముంబయి కళ్లు చెరిదే ఫీల్డింగ్‌తో వరుస రనౌట్లు చేసి దిల్లీని 193 పరుగులు ఆలౌట్ చేసింది. దీంతో 12 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Now we can say " 𝗘𝗸 𝘁𝗵𝗮 𝗷𝗼 𝗱𝘂𝗴𝗼𝘂𝘁 𝘀𝗲 𝗺𝗮𝘁𝗰𝗵 𝗷𝗲𝗲𝘁𝘄𝗮 𝗱𝗲𝘁𝗮 𝘁𝗵𝗮 " 💙🙌
— Indian Cricket Team (@incricketteam) April 13, 2025
rohit sharma - the mastermind 🧠#MIvsDC | #RohitSharma | #DCvsMI pic.twitter.com/leEggdUWaY
అలా మాజీ కెప్టెన్ రోహిత్ డగౌట్లో కూర్చొనే మ్యాచ్ ఫలితం మార్చేశాడు. పరాగ్ మాంబ్రే కూడా హిట్‌మ్యాన్‌ను మెచ్చుకున్నాడు. ఇక బౌలింగ్‌లో మార్పులు సూచిస్తూ తనదైన మార్క్ చూపించాడంటూ నెటిజన్లు హిట్‌మ్యాన్‌ను ప్రశంసిస్తున్నారు. 'రోహిత్ మాస్టర్‌మైండ్', 'కెప్టెన్సీ నుంచి రోహిత్‌ను తీసేసినా, నాయకుడి లక్షణాలు తీయలేరు', '5 టైటిళ్లు ఊరికే రాలేదు' అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
#MI's spinners 𝙩𝙪𝙧𝙣𝙚𝙙 the game on its head! 🙌
— Star Sports (@StarSportsIndia) April 13, 2025
Here’s how the experts broke down their coaching staff's spot-on call to bring them in at just the right moment 🗣#IPLonJioStar 👉 #LSGvCSK | MON, 14th APR, 6:30 PM LIVE on Star Sports 1, Star Sports 1 Hindi & JioHotstar! pic.twitter.com/POK9x6m9Qc
#RohitSharma #MumbaiIndians pic.twitter.com/2nYWyKTldR
— ऋतिक व्यास बनी (@hritikvyas8) April 14, 2025
Captaincy Skills peaks 🔥
— 𝟮𝟲𝟰 🎯🕊️ (@SaiRo45_) April 13, 2025
G.O.A.T #RohitSharma 🛐#DCvsMI pic.twitter.com/29YYXbc8Yc
They took captaincy away from Rohit, but they can never take the leader out of him!
— Nehhaaa (@nehhaaa__) April 13, 2025
Even from the dugout, his instincts & decisions proved why he's the greatest white-ball captain🔥♥️
So proud of you, Roooo😭🧿❤️#DCvMI #RohitSharma pic.twitter.com/K8EGLMmD4u
ఉత్కంఠ పోరులో ముంబయి గెలుపు- సీజన్లో దిల్లీకి తొలి ఓటమి
ముంబయి ఇండియన్స్ ప్లేయర్‌కు బిగ్ షాక్- లీగ్ నుంచి ఏడాది బ్యాన్!