Rohit Sharma Attending Non Sports Events : టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవలే అంతర్జాతీయ టీ20 కెరీర్‌కు రోహిత్ వీడ్కోలు చెప్పాడు. ప్రస్తుతం వన్డే, టెస్టుల్లో టీమ్ఇండియాకు సారథ్యం వహిస్తున్నాడు. అయితే రోహిత్‌కు క్రికెట్ సహా ఫుట్‌బాల్, టెన్నిస్, వంటి గేమ్స్ కూడా ఇష్టమే. అందుకే ఈ గేమ్స్ టోర్నీలు ఎక్కడ జరిగినా రోహిత్ అక్కడ కనిపిస్తుంటాడు . ఇటీవలే (అక్టోబరు 4న) అబుదాబి వేదికగా జరిగిన నేషనల్ బాస్కెట్ బాల్ లీగ్‌లోనూ సందడి చేశాడు. ఈ క్రమంలో రోహిత్ హాజరైన 5 నాన్ క్రికెట్ స్పోర్టింగ్ ఈవెంట్ లపై ఓ లుక్కేద్దాం పదండి.
1. యూఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్ (2016-17)
2017 ఫిబ్రవరిలో యూఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్‌లో భాగంగా బేయర్న్ మ్యూనిచ్, ఆర్సెనల్ జట్ల మధ్య జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌కు రోహిత్ హాజరయ్యాడు. అలియాంజ్ అరేనా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు తన భార్య రితిక, టీమ్ఇండియా సహచరుడు కేఎల్ రాహుల్‌తో కలిసి హిట్‌మ్యాన్ మ్యూనిచ్ వెళ్లాడు. ఈ మ్యాచ్‌లో ఆర్సెనల్‌పై మ్యూనిచ్ జట్టు ఘనవిజయం సాధించింది.
2. 2018 ఫిఫా ప్రపంచ కప్
ఐపీఎల్ 2018 సీజన్ ముగిసిన వెంటనే రోహిత్ తనకు దొరికిన ఖాళీ సమయాన్ని చక్కగా వినియోగించుకున్నాడు. 2018లో రష్యా వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్ ను చూసేందుకు వెళ్లాడు. స్పెయిన్, పోర్చుగల్ కు మధ్య జరిగిన మ్యాచ్ కు రోహిత్ హాజరయ్యాడు. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. తన అభిమాన జట్టు స్పెయిన్ రోహిత్ ఈ మ్యాచ్ లో మద్దతు ఇచ్చాడు. ఈ మ్యాచ్ కు హాజరైనప్పుడు రోహిత్ స్టేడియం వెలుపల భారత జాతీయ జెండాను పట్టుకుని ఫొటో దిగాడు. అప్పట్లో ఆ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Happy Republic Day❤#RepublicDay #VandeMataram pic.twitter.com/5dUgTvUGPW
— Rohit Sharma Trends™ (@TrendsRohit) January 26, 2020
3. లా లిగా (LaLiga) (2019-20)
రోహిత్ శర్మ 2020లో లాలిగా లీగ్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్‌ను చూసేందుకు మాడ్రిడ్ వెళ్లాడు. మాడ్రిడ్, బార్సిలోనా మధ్య జరిగిన మ్యాచ్ లో ఆతిథ్య జట్టు సునాయాశంగా విజయం సాధించింది. కాగా, ఫుట్‌బాల్‌పై రోహిత్ ఆసక్తిని గ్రహించిన లాలిగా, 2019లోనే అతడిని భారతీయ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది.
Hola India/España, as you guys know, football has always held a special place in my heart so this association is so special to me. And to be named the ambassador for the La Liga is so humbling. So excited for this partnership @LaLigaEN pic.twitter.com/prZFFSeHdV
— Rohit Sharma (@ImRo45) December 12, 2019
4. వింబుల్డన్ 2024
ఈ ఏడాది జరిగిన వింబుల్డన్ టోర్నమెంట్ లోనూ రోహిత్ మెరిశాడు. కార్లోస్ అల్కరాజ్, డానియల్ మెద్వెదేవ్ మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ కు రోహిత్ హాజరయ్యాడు. ఈ మ్యాచ్ లో అల్కరాజ్ విజయం సాధించాడు. కాగా, వింబుల్డన్ మ్యాచ్ కు రోహిత్ తో పాటు టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ సైతం హాజరయ్యాడు.
5. ఎన్బీఏ(NBA) ప్రీ సీజన్ 2024
రోహిత్ తన భార్య రితికతో కలిసి ఈ ఏడాది అక్టోబరు 4న నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ లీగ్‌కు హాజరయ్యాడు. ఈ పర్యటనలో రోహిత్ దిగ్గజ స్పెయిన్ గోల్ కీపర్ ఇకర్ కాసిల్లాస్ను కూడా కలిశాడు.
లేడీ ఫ్యాన్‌తో రోహిత్ నాగిన్ డ్యాన్స్- వీడియో వైరల్
ధోనీ సలహా పట్టించుకోని రోహిత్! హిట్‌మ్యాన్ తొలి డబుల్ సెంచరీ కొట్టినప్పుడు ఏం జరిగిందంటే?