Rohit Sharma Stand : ముంబయి ప్రతిష్ఠాత్మక స్టేడియం వాంఖడే స్టేడియంలో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఓ స్టాండ్ ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్సీఏ ఇప్పటికే ప్రకటించింది. దీనిపై రోహిత్ శర్మ తాజాగా స్పందించాడు. ఇది అస్సలు నమ్మశక్యంగా లేదని రోహిత్ అన్నాడు. ఈ గౌరవం ఇచ్చిన ముంబయి క్రికెట్ అసోసియేషన్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపాడు. ఒకప్పుడు వాంఖడే స్టేడియంలోకి వెళ్లేందుకు తాను చాలా కష్టపడాల్సి వచ్చేదని రోహిత్ తాజాగా గుర్తు చేసుకున్నాడు.
'ఆజాద్ గ్రౌండ్లో అండర్- 14 ట్రైనింగ్ ముగించుకుని ముంబయి రంజీ జట్టు ప్లేయర్లను చూసేందుకు స్నేహితులతో కలిసి వాంఖడే స్టేడియానికి వెళ్లేవాడిని. రంజీ జట్టు ప్రాక్టీస్ చేస్తుంటే లోపలికి అనుమతి ఉండేది కాదు. లోపలికి వెళ్లేందుకు పర్మిషన్ కోసం కోసం స్టేడియం బయటే నిల్చున్న రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. స్టేడియం లోపలికి వెళ్లేందకు అనుమతి పొందడం ఎంత కష్టమో అప్పుడు నాకు తెలుసు. కానీ, ఇప్పుడు స్టేడియంలో నా పేరు మీద ఓ స్టాండ్ ఏర్పాటు చేస్తున్నారంటే నమ్మశక్యంగా లేదు. ఇది జరుగుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు కూడా. ఈ గౌరవం ఇచ్చినందుకు జీవితాంతం రుణపడి ఉంటాను' అని రోహిత్ తెలిపాడు.
కాగా, టీమ్ఇండియాకు రోహిత్ శర్మ గత 18ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అతడి సారథ్యంలోనే భారత్ టీ20 వరల్డ్‌కప్, రీసెంట్గా ఛాంపియన్స్ ట్రోఫీ టైటిళ్లు నెగ్గింది. దీంతో అతడు భారత క్రికెట్‌కు అందించిన సేవలకుగాను రోహిత్ పేరిట స్టేడియంలో ఓ స్టాండ్ ఏర్పాటు చేస్తున్నట్లు ముంబయి క్రికెట్ అసోసియేషన్ ఇటీవల ప్రకటించింది. రోహిత్తోపాటుగా కొత్తగా టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ అజిత్ వాడేకర్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శరద్ పవార్ ఆయా స్టాండ్స్‌కు ఏర్పాటు చేయనుంది.

ఆ స్టాండ్‌కే హిట్‌మ్యాన్ పేరు!
స్టేడియంలో దాదాపు అన్ని స్టాండ్లకు పలువురు మాజీలు, ప్రముఖుల పేర్లు పెట్టారు. దీంతో ప్రస్తుతం ప్రెసిడెంట్ బాక్స్‌కు పైన ఉన్న గ్రాండ్ స్టాండ్‌కు రోహిత్ శర్మ పేరు పెట్టే అవకాశం ఉంది. కాగా, వాంఖడేలో ఇప్పటికే పలువురి పేర్లు ఆయా స్టాండ్లకు ఉన్నాయి. ఈస్ట్ స్టాండ్‌కు సునీల్ గావస్కర్, వెస్ట్ స్టాండ్‌కు విజయ్ మర్చంట్, నార్త్ స్టాండ్‌కు సచిన్ తెందూల్కర్, దిలీప్ వెంగ్‌సర్కార్ పేర్లు ఉండగా, మీడియా గ్యాలరీ బాల్ ఠాక్రే పేరిట ఉంది.
రోహిత్‌కు అరుదైన గౌరవం- వాంఖడే స్టేడియంలో హిట్‌మ్యాన్ స్టాండ్?
రోహిత్ శర్మ 'గేమ్‌ఛేంజర్'- డగౌట్లో కూర్చొనే మ్యాచ్ తిప్పేసిన హిట్‌మ్యాన్!