KKR vs RCB IPL 2025 : 2025 ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు శుభారంభం చేసింది. ఓపెనింగ్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో నెగ్గింది. 175 పరుగుల లక్ష్య ఛేదనను ఆర్సీబీ 16.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ (59* పరుగులు), ఫిల్ సాల్ట్ (56 పరుగులు) హాఫ్ సెంచరీలతో రాణించారు. కోల్‌కతా బౌలర్లలో నరైన్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ తలో 1 వికెట్ దక్కించుకున్నారు .
విరాట్, సాల్ట్ ధనాధన్
ఛేదనను ఆర్సీబీ ఘనంగా ప్రారంభించింది. ఓపెనర్లు విరాట్, సాల్ట్ బౌండరీలతో చెలరేగిపోయారు. ఒక్కొక్క బౌలర్‌ను టార్గెట్ చేస్తూ ఎడాపెడా బాదేశారు. ఇద్దరి విధ్వంసం వల్ల ఆర్సీబీ 5 ఓవర్లలోనే 70 స్కోర్ దాటింది. ఈ క్రమంలోనే ఫిల్ సాల్ట్ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. ఇక 95 పరుగుల వద్ద తొలి వికెట్ పడింది. వరుణ్ కేకేఆర్‌కు తొలి బ్రేక్ ఇచ్చాడు. కానీ, అప్పటికే కోల్‌కతాకు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది.
వన్ డౌన్లో వచ్చిన దేవదత్ పడిక్కల్ (10) స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగినా, కెప్టెన్ రజత్ పటిదార్ (34 పరుగులు, 16 బంతుల్లో), విరాట్‌తో కలిసి భాగస్వామ్యం నెలకొల్పాడు. చూడ చక్కనైన షాట్లతో ఆకట్టుకున్నాడు. చివర్లో పటిదార్‌ను వైభవ్ అరోరా ఔట్ చేశాడు. చివర్లో లియమ్ లివింగ్‌స్టోన్ (15*)తో కలిసి విరాట్ మిగిలిన పని పూర్తి చేశాడు.
Everything will be 🆗, when you've got VK! 💪👏
— Star Sports (@StarSportsIndia) March 22, 2025
The King brings up his half-century in style! ❤🙌
Watch LIVE action: https://t.co/iB1oqMusYv #IPLonJioStar 👉 #KKRvRCB, LIVE NOW on Star Sports Network & JioHotstar! pic.twitter.com/0HiNil4M5o
అంతకుముందు బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (4) విఫలమైనా, కెప్టెన్ అజింక్యా రహానే (56 పరుగులు; 31 బంతుల్లో: 6x4, 4x6) సూపర్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. సునీల్ నరైన్ (44 పరుగులు), అంగరిశ్ రఘువంశీ (30 పరుగులు) రాణించారు.
టాపార్డర్ రఫ్పాడించడం వల్ల జట్టు స్కోర్ 100 దాటింది. దీంతో స్కోర్ 200 దాటడం ఖాయమని భావించారు. కానీ, ఆర్సీబీ బౌలర్లు అనూహ్యంగా పుంజుకున్నారు. వరుసగా వెంకటేశ్ అయ్యర్ (6), రింకూ సింగ్ (12), అండ్రూ రస్సెల్ (4), హర్షిత్ రానా (5)ను పెలివియన్ చేరారు. బెంగళూరు బౌలర్లలో కృనాల్ పాండ్య, జోష్ హేజెస్వుడ్ 2, యశ్ దయాల్, రసిక్ ధార్, సుయాశ్ శర్మ తలో 1 వికెట్ దక్కించుకున్నారు.
Leading from the front and doing it in some style! 🫡💗#AjinkyaRahane brings up his third-fastest fifty in the #TATAIPL, owning this Battle of Royalty with pure class! 💪🏻
— Star Sports (@StarSportsIndia) March 22, 2025
Watch LIVE action: https://t.co/iB1oqMusYv #IPLonJioStar 👉 #KKRvRCB, LIVE NOW on Star Sports Network &… pic.twitter.com/RH8cGcmDmR