ETV Bharat / sports

మానవత్వం చాటుకున్న ఆర్సీబీ- ఆ కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్​గ్రేషియా! - IPL 2025

ఆర్సీబీ మంచి మనసు- మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం ప్రకటన

Royal Challengers Bengaluru
Royal Challengers Bengaluru (Source : RCB 'x')
author img

By ETV Bharat Sports Team

Published : June 5, 2025 at 4:20 PM IST

Updated : June 5, 2025 at 4:45 PM IST

2 Min Read

RCB Compensation IPL 2025 : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవ వేడుకల్లో మరణించిన మృతుల కుటుంబాలకు యాజమాన్యం ఆర్థిక సహకారం ప్రకటించింది. తొక్కిసలాటలో మృతి చెందిన కుటుంబాలకు రూ.10 లక్షలు ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు అధికారికంగా ఓ పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఘటన జరగడం దురదృష్టకరం అని తెలిపింది.

'బెంగళూరులో జరిగిన తొక్కిసలాట ఘటన RCB కుటుంబానికి తీవ్ర వేదన, బాధను కలిగించింది. ఇది దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. ఈ ఘటనలో మరణించిన పదకొండు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించాం. అలాగే గాయపడిన అభిమానులను, RCB కేర్స్ ఫండ్ ద్వారా ఆదుకుంటాం. ఆ జర్నీలో అభిమానులే మా బలం. వారు మాకు అన్ని పరిస్థితుల్లో మద్దతుగా నిలబడ్డారు. ఈ విషాద సమయంలో మేం వారికి అండగా నిలుస్తాం' అని ఆర్సీబీ ఎక్స్​లో పోస్ట్ షేర్ చేసింది. కాగా, బుధవారం కర్ణాటక ప్రభుత్వం కూడా మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రకటించింది.

17 ఏళ్ల తర్వాత ఐపీఎల్​లో ఆర్సీబీ ఛాంపియన్​గా నిలవడం వల్ల ఈ విక్టరీని పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేయాలని ఫ్రాంచైజీ నిర్ణయించింది. ఈ క్రమంలోనే బెంగళూరు నగరంలో బస్ పరేడ్ ఆ తర్వాత చిన్నస్వామి స్టేడియంలో కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్​కి ప్రీ పాసులు అందించనున్నట్లు మేనేజ్​మెంట్ సోషల్ మీడియాలో పేర్కొంది.

అయితే పాసులు లేని అభిమానులు కూడా భారీ ఎత్తున స్టేడియానికి తరలి వచ్చారు. భద్రతా బలగాలు ఉన్నప్పటికీ క్రౌడ్ ఎక్కువవ్వడం వల్ల పరిస్థితి కంట్రోల్ తప్పి తొక్కిసలాట జరిగింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. అయినప్పటికీ ఈ ఘటనలో పదకొండు మంది మృతి చెందగా, 33 మంది గాయపడ్డారు. దీంతో యావత్ క్రీడా లోకం తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది. ఫ్రాంచైజీ మేనేజ్మెంట్ సహా, పలువురు ఆటగాళ్లు మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

'విషాదం గురించి కోహ్లీకి అప్పుడు తెలియదేమో- కానీ అది చాలా బాధాకరం'

ఆర్సీబీ విక్టరీ సంబరాల్లో విషాదం- తొక్కిసలాటలో పదకొండు మంది మృతి!- మోదీ సంతాపం

Last Updated : June 5, 2025 at 4:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.