RCB Controversy On Mumbai Indians : ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వివాదానికి తెర తీసింది. ముంబయి ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు జరిగిన తీరును ఎగతాళి చేస్తున్నట్లుగా ఉన్న ఆర్సీబీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్సీబీకి చెందిన 'మిస్టర్ నాగ్స్' ఆర్సీబీ కొత్త కెప్టెన్ రజత్ పటిదార్‌తో ముచ్చటిస్తున్న సందర్భంలో ముంబయి ఇండియన్స్‌ను ట్రోల్ చేశాడు. ఇంతకీ అతడు ఏమన్నాడంటే?
'పటీదార్ మొత్తానికి నువ్వు కెప్టెన్ అయ్యావు. ఆర్సీబీ గత కెప్టెన్లు నీ ఎంపికకు మద్దతు ఇచ్చారు. విరాట్, డుప్లెసిస్ నీకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఐపీఎల్లో మిగతా జట్ల కెప్టెన్సీ మార్పు కూడా ఇలాగే జరిగిందని నువ్వు అనుకుంటున్నావా?' అని అడిగాడు. దానికి పటీదార్ కాంట్రపర్సీలకు ఛాన్స్ ఇవ్వకుండా 'నన్ను మన్నించండి. నాకు ఆ విషయాలేమీ తెలియవు' అని తెలివిగా చెప్పి తప్పించుకున్నాడు.
దీనికి 'రజత్ నీకు నిజంగా తెలియదా? అయితే ఎందుకు నవ్వుతున్నావు? అంటే నీ ఉద్దేశం 'MI nahi janta (MI) అనే కదా!' (ముంబయు ఇండియన్స్‌కు తెలియదు అనే అర్థంలో) అని మిస్టర్ నాగ్ అన్నాడు. పటీదార్- నాగ్స్కు మధ్య జరిగిన ఈ చిట్‌చాట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అయితే గతేడాది హార్దిక్ పాండ్యను ముంబయి తిరిగి జట్టులోకి తీసుకుంది. రోహిత్ శర్మ స్థానంలో పాండ్యను మేనేజ్మెంట్ కెప్టెన్‌గా నియమించింది. ఈ నిర్ణయాన్ని రోహిత్ అభిమానులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో హార్దిక్- రోహిత్ మధ్య విభేదాలు తలెత్తాయని, ఇది డ్రెస్సింగ్ రూమ్‌లో ఉద్రిక్తతలకు దారి తీసిందనే ప్రచారం జరిగింది. ఇక హార్దిక్ ఆ సీజన్లో ఫ్యాన్స్‌కు టార్గెట్ అయ్యాడు. అతడిని తీవ్రంగా ట్రోల్ చేశారు.
Mr. Nags absolutely owned the 'Selfless Captain' and MI in his recent video with Rajat Patidar 😭☠️🔥 pic.twitter.com/AdFWMcPkct
— Ayush (@itsayushyar) March 21, 2025