RCB vs CSK IPL 2025 : చెపాక్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- చెన్నై సూపర్ కింగ్స్ మధ్య శుక్రవారం హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. గాయం కారణంగా కేకేఆర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌కు దూరమైన స్వింగ్ కింగ్, ఆర్సీబీ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఈ మ్యాచ్‌లోనైనా ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ క్రమంలో భువీ గాయంపై అప్డేట్ వచ్చింది.
సీఎస్కేతో మ్యాచ్‌కు ముందు ఆర్సీబీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. గాయంతో కేకేఆర్‌తో మ్యాచ్‌కు దూరమైన భువీ పూర్తి ఫిట్ నెస్ సాధించినట్లు తెలుస్తోంది. చెన్నైతో జరగబోయే మ్యాచ్‌లో భువీ బరిలోకి దిగనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆర్సీబీ కోచ్ దినేశ్ కార్తీక్ వెల్లడించాడు. అలాగే చెపాక్‌లో భువీ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను ఆర్సీబీ తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. అందులో స్వింగ్ కింగ్‌గా బౌలింగ్ చేస్తూ కనిపించాడు. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.
'నాకు తెలిసినంతవరకు భువనేశ్వర్‌గా ఫిట్‌గా ఉన్నాడు. అతడికి ఎలాంటి సమస్య లేదు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆట పట్ల అంకితభావంతో ఉన్నాడు. చెపాక్‌లో సీఎస్కే స్పిన్నర్లను ఎదుర్కోవడానికి కొత్త షాట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. విభిన్న షాట్లను సాధన చేస్తూ ఆటపై తన కసిని చూపిస్తున్నాడు. తనను తాను మెరుగుపరుచుకోవాలనుకుంటున్నాడు. అందుకే విరాట్ ఒక స్పెషల్ ప్లేయర్. అతను ఐపీఎల్లో ఎప్పుడూ లేనంత కాన్ఫిడెంట్‌గా, బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు' అని దినేశ్ కార్తీక్ వెల్లడించాడు.
కాగా, ఐపీఎల్ రికార్డ్స్ చూస్తే బెంగళూరుపై సీఎస్కేదే పూర్తి ఆధిపత్యం. రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 33 మ్యాచ్‌లు జరగ్గా సీఎస్కే పైచేయి సాధించింది. 21 మ్యాచ్‌ల్లో చెన్నై గెలుపొందగా, ఆర్సీబీ 11 మ్యాచ్‌ల్లోనే విజయం సాధించింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. మరో విశేషం ఏంటంటే చెపాక్‌లో ఆర్సీబీ గత 17 ఏళ్లలో ఒక్క మ్యాచ్‌లోనూ గెలవలేదు. ఐపీఎల్ ఆరంభ సీజన్‌లో తప్ప తర్వాత జరిగిన ఎనిమిది మ్యాచ్‌ల్లో చెన్నై జట్టే గెలుపొందింది.
𝐈𝐭’𝐬 𝐚𝐥𝐥 𝐜𝐚𝐥𝐦 𝐨𝐧 𝐭𝐡𝐞 𝐬𝐨𝐮𝐭𝐡𝐞𝐫𝐧 𝐟𝐫𝐨𝐧𝐭!
— Royal Challengers Bengaluru (@RCBTweets) March 28, 2025
Smiles, warmth and chill vibes ahead of the big match up tonight at Chepauk!
🎧: Animal #PlayBold #ನಮ್ಮRCB #CSKvRCB pic.twitter.com/bhQSBcN38K
SRH ఆల్‌రౌండర్ మల్టీటాలెంట్- రెండు చేతులతో బౌలింగ్ అదరగొట్టేస్తున్నాడుగా!
స్పిన్‌తో కోహ్లీని కమ్మేద్దామనుకున్నారా? 'కింగ్' స్పెషల్ ప్రిపరేషన్ - ఇక బౌండరీలకు బ్రేకులుండవ్!