ETV Bharat / sports

గోల్డ్ మెడలిస్ట్​కు ఐఫోన్ గిఫ్ట్- లైఫ్ టైమ్ గ్రిల్ చికెన్ ఫ్రీ! - Paris Olympics 2024

Philippines Olympic Gold Medalist: ఫిలిప్పిన్స్​కు చెందిన ఓ స్వర్ణ పతక విజేత అద్భుత నజారానాలు అందుకున్నాడు. రెండు రోజుల తేడాతో 2 బంగారు పతకాలు పొందిన ఫిలిప్పీన్స్ ఈ అథ్లెట్‌ కనక వర్షంలో తడిసి ముద్దవుతున్నాడు.

author img

By ETV Bharat Sports Team

Published : Aug 10, 2024, 1:59 PM IST

Olympic Gold Medalist
Olympic Gold Medalist (Source: Associated Press (Left), Getty Images (Right))

Philippines Olympic Gold Medalist: విశ్వ క్రీడల్లో ఒలింపిక్‌ పతకం గెలవడం ప్రతీ అథ్లెట్‌ కల. అలాంటి ఘనతే సాధించాడు ఫిలిప్పిన్స్‌కు చెందిన జిమ్నాస్ట్‌ కార్లోస్ ఇ యులో. 24 ఏళ్ల ఈ జిమ్నాస్ట్‌ రెండు రోజుల వ్యవధిలో రెండు బంగారు పతకాలు గెలిచి చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో ఒలింపిక్స్​లో బంగారు పతకం సాధించిన తొలి పురుష అథ్లెట్​గా రికార్డ్ కొట్టాడు. పురుషుల జిమ్నాస్టిక్స్‌లో ఫ్లోర్ ఎక్సర్‌సైజ్ ఈవెంట్‌లో స్వర్ణం గెలిచిన ఇ యులో, వాల్ట్ రొటీన్‌లోనూ మరో గోల్డ్‌ మెడల్‌ కొల్లగొట్టాడు. ఈ విజయం సాధించేందుకు ఇయులో ఎంత కష్టపడ్డాడు. ఈ విజయం సాధించడంతో ఇప్పుడు ఇ యులోపై కానుకల వర్షం కురుస్తోంది. కార్పొరేట్‌ కంపెనీలు, పారిశ్రామిక వేత్తలు ఇ యులోకు భారీగా నజరానాలు ప్రకటిస్తున్నారు. ఈ నజరానాలతో ఇ యులో తడిసి ముద్దవుతున్నాడు.

ప్రభుత్వం నుంచి కంపెనీల దాకా
ఫిలిప్పిన్స్ ప్రభుత్వం బంగారు పతక విజేత ఇ యులోకు 10 మిలియన్ ఫిలిప్పిన్ పెసోలను నజరానాగా ప్రకటించింది. ఇది లక్షా 73 వేల డాలర్లకు సమానం. ఫిలిప్పిన్స్‌ రాజధాని మనీలాకు సమీపంలోని ఓ లగ్జరీ అపార్ట్‌మెంట్​లో డబుల్‌ బెడ్​రూమ్​ ఫ్లాట్​ను గిఫ్ట్‌గా ఇచ్చింది. ఇక ఒలింపిక్స్‌ క్రీడల్లో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున తాము వేడుకలు జరుపుకునేందుకు ఇంతకన్న గొప్ప సందర్భం లేదని అక్కడి ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా, ఫిలిప్పిన్స్ 1924లో తొలిసారి ఒలింపిక్స్‌లో పాల్గొంది.

నజరానాలే నజరానాలు
ఇ యులోకు పలు కంపెనీల ద్వారా అదనంగా మరో ఆరు మిలియన్ పెసోలు ప్రైజ్​మనీ అందనుంది. వివిధ చైన్‌ రెస్టారెంట్లు కూడా ఈ స్టార్‌ జిమ్నాస్ట్‌కు రామెన్, మాకరోనీ, చీజ్, గ్రిల్డ్ చికెన్‌ల రెసిపీలను జీవితకాలం ఉచితంగా సరఫరా చేస్తామని ప్రకటించాయి. ఇ యులోకు ఘన స్వాగతం పలికేందుకు కూడా అక్కడి ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రైవేటు కంపెనీలతోపాటు యూనివర్శిటీలు కూడా యులోకు పారితోషికం ఇచ్చేందుకు క్యూ కట్టాయి. మిండానావో విశ్వవిద్యాలయం ఇ యులో ట్యూషన్ ఫీజును రద్దు చేసింది.

మరోవైపు ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన వారికి డబుల్‌ బెడ్‌రూం ఇస్తామని ఫిలిపినో రియల్ ఎస్టేట్ కంపెనీ ముందే ప్రకటించింది. ఇది కూడా ఇ యులోకు దక్కనుంది. ఇక్కడ డబుల్‌ బెడ్‌రూం విలువ 4 లక్షల 14 వేల డాలర్లు ఉంటుంది. జీవితాంతం యులోకు గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ సేవలు ఉచితంగా అందిస్తామని ఓ ఆస్పత్రి తెలిపింది.

వీటితోపాటు ఇవి కూడా: బంపర్ బహుమతులతోపాటు ఇ యూలోకు ఐఫోన్ 16, లోకల్ బెకరీల్లో, రెస్టారెంట్లలో ఫుడ్ లైఫ్ టైమ్​ ఫ్రీ అని అనౌన్స్ చేశారు.

10గంటల్లో 4.6కేజీలు తగ్గిన అమన్- లేకుంటే మళ్లీ అది రిపీట్ అయ్యేదే! - Paris Olympics

'టైమ్‌ ఫర్‌ అంపైర్స్‌ కాల్‌'- వినేశ్‌ సిల్వర్​కు అర్హురాలే- మెడల్‌ లాక్కోవడంలో నో లాజిక్‌! - Sachin Vinesh phogat

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.