ETV Bharat / sports

పారిస్‌ ఒలింపిక్స్‌ మెడల్​ విన్నర్స్​పై కాసుల వర్షం - ఎవరెవరికి ఎంతిచ్చారంటే? - Paris Olympics 2024

Paris Olympics 2024 Prize Money : పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్‌లో మను బాకర్​, నీరజ్ చోప్రా సహా పలువురు అథ్లెట్లు కలిసి ఆరు పతకాలు సాధించారు. మరి వారికి దక్కిన ప్రైజ్​మని ఎంతో తెలుసా?

author img

By ETV Bharat Sports Team

Published : Aug 13, 2024, 6:12 AM IST

source Associated Press
Paris Olympics 2024 Prize Money (source Associated Press)

Paris Olympics 2024 Prize Money : ప్రపంచదేశాల అథ్లెట్ల ప్రదర్శనలతో అట్టహాసంగా జరిగిన పారిస్ ఒలింపిక్స్ 2024 ముగిసింది. ఇండియా నుంచి పాల్గొన్న అథ్లెట్లు ఆరుగురు పతకాలు సాధించి సగర్వంగా స్వదేశానికి తిరిగి వచ్చారు. దీంతో అంతర్జాతీయ ఈవెంట్‌లో భారతదేశపు సత్తా చాటిన అథ్లెట్లకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భారీ నగదు ప్రోత్సాహకాలను ప్రకటించి గౌరవించింది.

స్వప్నిల్ కుశాలె (షూటింగ్) - పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ విభాగంలో స్వప్పిల్ కాంస్యాన్ని అందుకున్నాడు. ఇప్పటివరకూ ఈ విభాగంలో పతకం అందుకున్న తొలి అథ్లెట్ నిలవడంతో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాడు. స్వప్పిల్ సాధించిన విజయానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే రూ.కోటి నజరానా ప్రకటించారు. అంతేకాకుండా సెంట్రల్ రైల్వేలో స్పెషల్ ఆఫీసర్‌గా కూడా ఉద్యోగం లభించింది.

సరబ్ జోత్​ సింగ్ (షూటింగ్) - 10 మీటర్ల మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్​లో మనుబాకర్​తో కలిసి సరబ్ కాంస్యాన్ని అందుకున్నారు. అతనిని గౌరవిస్తూ హరియాణా ప్రభుత్వం గవర్నమెంట్ ఉద్యోగం ఆఫర్ చేయగా దానిని అతడు సున్నితంగా తిరస్కరించారు. తన దృష్టి అంతా షూటింగ్​పైనే ఉందని అన్నాడు. ఇకపోతే కేంద్ర క్రీడల శాఖ మంత్రి అతడికి రూ.22.5 లక్షల రివార్డు ప్రకటించింది.

మనుబాకర్ (షూటింగ్) - ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు తెచ్చిపెట్టిన అథ్లెట్‌గా నిలిచారు మనుబాకర్. 10మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంతో పాటు సరబ్‌తో కలిసి మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్లో కాంస్యం గెలుచుకున్నారు. మనబాకర్​కు కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ రూ.30లక్షల రివార్డు ప్రకటించారు.

పురుషుల హాకీ జట్టు - వరుసగా రెండో సారి కాంస్య పతకాన్ని సాధించి పారిస్ ఒలింపిక్స్‌లో అదరగొట్టింది భారత పురుషుల హాకీ జట్టు. ఈ మేరకు హాకీ ఇండియా ఒక్కో ప్లేయర్‌కు రూ.15 లక్షలు ప్రకటించగా, సహాయక సిబ్బందికి ఒక్కొక్కరికి రూ.7.5 లక్షల చొప్పున బహుమతి అందజేయనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా హాకీ జట్టు మొత్తానికి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ రూ.కోటి నగదు బహుమతి ప్రకటించారు. ఒడిశా ప్రభుత్వం, డిఫెండర్ అమిత్ రోహిదాస్‌కు రూ.4 కోట్ల నజరానా, ఒక్కో సభ్యుడికి రూ.15 లక్షలు, సపోర్ట్ స్టాఫ్​కు రూ.10లక్షలు ఇస్తామని ప్రకటించింది.

నీరజ్ చోప్రా - మరోసారి భారతదేశానికి పతకాన్ని తెచ్చిపెట్టాడు నీరజ్ చోప్రా. రజత పతకాన్ని అందుకున్నాడు. అయితే ఈ అథ్లెట్​కు ఎటువంటి రివార్డులను ప్రకటించపోయినప్పటికీ పలు సంస్థలు భారీగా రివార్డులు, అవార్డులు అందజేయనున్నట్లు తెలుస్తోంది. టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా స్వర్ణం సాధించినప్పుడు హరియాణా ప్రభుత్వం రూ.6కోట్ల బహుమతిని ప్రకటించిన సంగతి తెలిసిందే.

అమన్ సెహ్రావత్ (రెజ్లింగ్) - రెజ్లింగ్ పతక ఆశలను సజీవంగా నిలుపుతూ భారత రెజ్లర్ అమన్ పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించాడు. 57 కిలోల విభాగంలో ఘనత సాధించిన అమన్‌కు భారీ స్థాయిలోనే నగదు అందనున్నట్లు సమాచారం.

పారిస్ ఒలింపిక్స్​ - మన అథ్లెట్లు సాధించిన 11 సూపర్​​ రికార్డులివే - Paris Olympics 2024 Records

నీరజ్​ చోప్రా బయోపిక్​కు ఆ హీరో మాత్రమే సెట్ అవుతాడు : ఒలింపిక్ గోల్డ్​ విన్నర్​ అర్షద్ - Paris Olympics 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.