Para Archer Avani Lekhara Special Interview : 2024 పారిస్ పారాలింపిక్స్‌లో పాల్గొన్న భారత పారా అథ్లెట్లు స్వదేశానికి చేరుకున్నారు. పారాలింపిక్స్‌లో వరుసగా రెండో బంగారు పతకంతో దేశానికి, రాజస్థాన్‌కి పేరు తీసుకొచ్చిన గోల్డెన్ గర్ల్ అవని లేఖరా జైపుర్‌కు చేరుకుంది. ఇంటికి చేరుకున్న ఆమెకు కుటుంబ సభ్యులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.
ఇక పారాలింపిక్ క్రీడల కోసం పారిస్‌కు వెళ్లే ముందు తాను చాలా ఒత్తిడి ఎదుర్కొన్నట్లు అవని చెప్పింది. టోక్యోలో బంగారు పతకాన్ని గెలుచుకున్న తర్వాత, తనపై భారీ అంచనాలు నెలకొన్నాయని, మరో గోల్డ్ మెడల్ సాధిస్తానని పెట్టుకున్న అంచనాలు అందుకున్నానని పేర్కొంది.
ఇండియాలో పెరుగుతున్న షూటింగ్ క్రేజ్
'ఈటీవీ భారత్'తో అవని తాజాగా మాట్లాడింది. ఈ నేపథ్యంలో షూటింగ్‌కు భారత్‌లో ఉన్న క్రేజ్ గురించి ఆమె చెప్పుకొచ్చింది."గత కొన్నేళ్లుగా దేశంలో షూటింగ్‌కి క్రేజ్ పెరిగిపోయింది. పారిస్ పారాలింపిక్ గేమ్స్‌లో ఇండియా తరఫున 10 మంది షూటర్లు పాల్గొన్నారు. వారిలో ఐదుగురు మొదటిసారి పారాలింపిక్స్‌లో పోటీ పడ్డారు. ఇది ప్రజల్లో క్రీడలపై ముఖ్యంగా షూటింగ్‌పై పెరుగుతున్న ఉత్సాహాన్ని చూపుతుంది. ఇప్పుడు పారా స్పోర్ట్స్ కూడా గుర్తింపు తెచ్చుకుంటున్నాయి." అని వివరించింది.
పారిస్ పారాలింపిక్ గేమ్స్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో అవని లేఖరా స్వర్ణ పతకం సాధించింది. ఈసారి పారిస్ పారాలింపిక్ క్రీడల్లో భారత అథ్లెట్ల బృందం అత్యుత్తమ ప్రదర్శన చేసింది. మొత్తం 84 మంది అథ్లెట్లు పోటీపడగా, దేశానికి 29 పతకాలు లభించాయి. ఇందులో 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలు ఉన్నాయి.
అథ్లెట్లను అభినందనలు తెలిపిన క్రీడా మంత్రి
ఈ సందర్భంగా రాజస్థాన్ క్రీడా మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ అద్భుత ప్రదర్శన చేసిన క్రీడాకారులందరినీ అభినందించారు. పారిస్ పారాలింపిక్స్‌లో కష్టపడి, పట్టుదలతో సాధించిన గొప్ప విజయాలను చూసి దేశం గర్విస్తోందని అన్నారు. మోదీ ప్రభుత్వం దేశంలోని యువ ప్రతిభను క్రీడల వైపు ఆకర్షిస్తోందని చెప్పారు.
క్రీడలకు ప్రభుత్వ మద్దతు
పారిస్ పారాలింపిక్స్‌లో అథ్లెట్లు అత్యుత్తమ ప్రదర్శనకు ప్రభుత్వ సహకారం కూడా కారణం. కేంద్రం మెరుగైన క్రీడా మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. క్రీడలకు బడ్జెట్ పెంచుతోంది. పారా అథ్లెట్లకు అనుకూల వాతావరణం, వ్యవస్థను అభివృద్ధి చేసింది.
పారాలింపిక్స్‌లో భారత్ బోణీ - ఒకేరోజు గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ - Paralympics India 2024