బాబర్, రిజ్వాన్‌కు పాకిస్థాన్‌కు షాక్- ఆసియా కప్‌లో నో ప్లేస్
ఆసియా కప్‌కు పాకిస్థాన్ జట్టు ప్రకటన- సీనియర్లకు గట్టి షాక్

Published : August 17, 2025 at 2:20 PM IST
Pakistan Asia Cup 2025 Squad : ఆసియా కప్ 2025 హీట్ మొదలైంది. ఈ టోర్నీ యూఏఈ వేదికగా టీ20 ఫార్మాట్లో జరగనుంది. సెప్టెంబర్ 9న ప్రారంభమై అదే నెల 28 ఫైనల్‌తో ముగియనుంది. ఈ క్రమంలో పాకిస్థాన్ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆసియా కప్ కోసం జట్టును ప్రకటించింది. 17 మందితో కూడిన స్క్వాడ్‌ను ఆదివారం అనౌన్స్ చేసింది. ఆసియా కప్‌తోపాటు యూఏఈ వేదికగా జరగనున్న ట్రై సిరీస్‌కు కూడా ఇదే జట్టుతో పాకిస్థాన్ ఆడనుంది.
సీనియర్లకు షాక్
గత కొద్దిరోజులుగా పేలవ లేమితో విఫమవుతున్న సీనియర్లు మహ్మద్ రిజ్వాన్, బాబర్ అజామ్‌కు బోర్డు గట్టి షాక్ ఇచ్చింది. ఈ ఇద్దర్నీ ఆసియా కప్ జట్టుతోపాటు, ట్రై సిరీస్‌కు కూడా ఎంపిక చేయకుండా, పక్కన పెట్టేసింది. మహ్మద్ రిజ్వాన్ వన్డే జట్టు కెప్టెన్‌గా ఉన్నాడు. అటు బాబర్ జట్టులో సీనియర్ ప్లేయర్‌గా ఉన్నాడు. అయినప్పటికీ ఈ ఇద్దరిని జట్టు నుంచి తొలగించారు.
అప్పట్నుంచే పక్కన పెట్టేసిన పాక్
2024 టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్ గ్రూప్ స్టేజ్‌లోనే నిష్క్రమించింది. ఆ టోర్నీలో బాబర్ అజామ్, రిజ్వాన్ పేలవ ప్రదర్శనతో ఆకట్టుకోలేకపోయారు. దీంతో ఈ ఇద్దరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అప్పట్నుంచే వీరిద్దరిని బోర్డు టీ20 ఫార్మాట్‌కు దూరంగా పెట్టింది. ఇటీవల ముగిసిన వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు కూడా ఎంపిక చేయలేదు. కానీ, వన్డే సిరీస్‌లో ఆడారు. ఈ వన్డే సిరీస్‌లోనూ ఫెయిల్ అయ్యారు. దీంతో బాబర్, రిజ్వాన్ ఆసియా కప్‌లో కూడా ఆడడం కష్టమేనని ఇప్పటికే విశ్లేకులు అభిప్రాయపడ్డారు.
Pakistan reveal squad for the UAE tri-series and Asia Cup 👇https://t.co/wDey9hskS6
— ICC (@ICC) August 17, 2025
పాక్ జట్టు
సల్మాన్ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రాఫ్, ఫకర్ జమాన్, హారిస్ రవూఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారిస్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ వాసిమ్ జూనియర్, షహిబ్‌జాద ఫర్హాన్, సయామ్ ఆయుబ్, సల్మాన్ మిర్జా, షహీన్ షా అఫ్రిది, సుఫ్‌యాన్ మోకిమ్

