Gambhir On Rohit Virat Retirement : స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుండానే టీమ్‌ఇండియా వచ్చే నెలలో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో ఆతిథ్య ఇంగ్లాండ్‌తో భారత్ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సీనియర్ల రిటైర్మెంట్పై టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తొలిసారి స్పందించాడు. మరి ఆయన ఏమన్నాడంటే?
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ స్థానాలను టెస్టు ఫార్మాట్లో భర్తీ చేయడం కష్టమైన పనే అని గంభీర్ పేర్కొన్నాడు. కానీ, యువతరం వస్తుందనే నమ్మకం తనకు ఉందని తెలిపాడు. 'జట్టులో ఇద్దరు సీనియర్లు లేకుండానే ఆడే పరిస్థితి ఏర్పడింది. అయితే కొత్త వాళ్లు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పేందుకు ఇది మంచి ఛాన్స్. రోహిత్, విరాట్ లేకుండా ఆడటం మాత్రం కాస్త కష్టమైన పనే' అని గంభీర్ ఓ స్పోర్ట్స్ ఛానెల్లో పేర్కొన్నాడు.
బుమ్రా లేకపోయినా గెలిచాం!
టీమ్ఇండియా ఇటీవల స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా లేకపోయినప్పటికీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిందని గుర్తు చేశాడు.‘ ఛాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా దూరమయ్యాడు. అప్పుడు కూడా నేను ఇదే చెప్పాను. ఎవరైనా ఒకరు దూరమైతే, జాతీయ జట్టుకు ఆడడానకి మరొకరికి ఛాన్స్ లభిస్తుంది. ఆ అవకాశం కోసం ఎదురుచూసే ఇతర ప్లేయర్లు ఉంటారని నేను నమ్ముతా' అని గంభీర్ చెప్పాడు.

వాళ్లపై ఒత్తిడి లేదు! : కాగా, రోహిత్, విరాట్ రిటైర్మెంట్ ప్రకటన వాళ్ల వ్యక్తిగత నిర్ణయమని గంభీర్ అన్నాడు. ప్లేయర్లపై ఒత్తిడి తీసుకొచ్చే హక్కు సెలెక్షన్ కమిటీకి, మేనేజ్మెంట్కు లేదని గంభీర్ స్పష్టం చేశాడు.

కొత్త కెప్టెన్ ఎవరో?
రోహిత్ రిటైరైన నేపథ్యంలో టీమ్ఇండియాకు కొత్త కెప్టెన్‌గా ఎవరు నియమితులవుతారోనని ఆసక్తి నెలకొంది. శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, జస్ప్రిత్ బుమ్రా పేర్లు ప్రచారంలో ఉన్నాయి. కానీ, మేనేజ్మెంట్ ఇంకా ఎవరినీ ఫైనలైజ్ చేయలేదు. ఇక జూన్ 13న ఇంగ్లాండ్‌తో సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో ఒక వార్మప్ సహా ఐదు టెస్టులు ఆడాల్సి ఉంది. ఈ పర్యటనకు శనివారం జట్టును ప్రకటించే ఛాన్స్ ఉంది.
'టీమ్ఇండియా వాళ్ల జాగీరు కాదు!'- రోహిత్, విరాట్ ఫ్యూచర్‌పై గంభీర్ రియాక్షన్
ధోనీ స్టైల్లో రిటైర్మెంట్కు రోహిత్ ప్లాన్! షాకిచ్చిన బీసీసీఐ- సడెన్ డెసిషన్ అందుకేనా?