'నేను మర్చిపోను!'- మ్యాచ్ తర్వాత నీతా అంబానీ పనికి నెటిజన్లు ఫిదా
ప్లేఆఫ్స్‌కు ముంబయి ఇండియన్స్- నీతా అంబాని చేసిన పనికి నెటిజన్లు ఫిదా!

Published : May 22, 2025 at 1:55 PM IST
Mi vs DC IPL 2025 : దేశంలో కొవిడ్-19 కేసులు మళ్లీ కలకలం రేపుతున్నాయి. దీని ప్రభావం ఐపీఎల్ మీద కూడా పడింది! రీసెంట్గా సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ కొవిడ్ బారిన పడ్డాడు. దీంతో ఓ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో ముంబయి ఇండియన్స్ యజమాని నీతా అంబానీ తమ ఆటగాళ్ల పట్ల తీసుకున్న ప్రత్యేక శ్రద్ధకు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇంతకీ ఆమె ఏం చేశారంటే?
వాంఖడే వేదికగా బుధవారం ముంబయి ఇండియన్స్- దిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ముంబయి 59 పరుగులు భారీ తేడాతో నెగ్గి ప్లేఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. అయితే మ్యాచ్ అనంతరం ఇరుజట్ల ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకునే సమయంలో ముంబయి ఓనర్ నీతా అంబాని కొవిడ్ ప్రొటోకాల్ పాటించారు. తమ ఆటగాళ్లందరికీ శానిటైజర్ అందించి జాగ్రత్త వహించారు. ముంబయి ప్లేయర్లకే కాకుండా ఆల్‌రౌండర్ దీపక్ చాహర్ దిల్లీ ఆటగాళ్లకు సైతం శానిటైజర్ అందించాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆమెను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
Seeing Nita Ambani, Rohit Sharma, Suryakumar and other players using sanitizer reminded me of covid-19.😂😭 pic.twitter.com/20ArDT2BXt
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) May 21, 2025
ఐపీఎల్‌కు మళ్లీ బ్రేక్ పడే ప్రమాదం!
ఒకవేళ కొవిడ్ మళ్లీ విజృంభించి, ఐపీఎల్లో ఆడుతున్న ప్లేయర్లకు సోకితే టోర్నమెంట్‌కు మళ్లీ బ్రేక్ పడే ప్రమాదం ఉంది. అందుకే ప్లేయర్లందరూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే కొవిడ్ ప్రభావం ఐపీఎల్ మీద పడే ఛాన్స్ ఉండదు. దీంతో టోర్నీ సాఫీగా సాగిపోతుంది! ఈ టోర్నీలో ఇంకా 11 మ్యాచ్ (7 లీగ్, 4 ప్లేఆఫ్స్)లు జరగాల్సి ఉంది.
ఆరో టైటిల్ కమింగ్ సూన్
మ్యాచ్ ముగిసిన అనంతరం డగౌట్లో కూర్చున్న నీతా అంబానీ చేతితో ఆరు వేళ్లను చూపిస్తున్న ఫొటో కూడా వైరల్‌గా మారింది. అంటే ముంబయి ఇండియన్స్‌కు ఆరో ఐపీఎల్ టైటిల్ 'ఆన్ ది వే' అన్నట్లు ఆమె సింబాలిక్‌గా చెప్పారు. కాగా, ముంబయి ఇప్పటివరకు ఐదు (2013, 2015, 2017, 2019, 2020)సార్లు ఛాంపియన్‌గా నిలిచింది.
Nita Ambani signalling,MI are coming for the 6th Trophy!😜#MIvsDC #MumbaiIndians pic.twitter.com/QDn3Bl8bQ5
— Sarcasm (@sarcastic_us) May 21, 2025

