Neeraj Chopra New Record : భారత స్టార్ జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా సరికొత్త చరిత్ర సృష్టించాడు. తొలిసారి తన కెరీర్‌లో 90 మీటర్ల మార్క్‌ను అధిగమించాడు. ఖతార్ వేదికగా జరుగుతున్న దోహా డైమండ్ లీగ్‌లో ఈ ఘనతను సాధించాడు.
మూడో రౌండ్‌లో నీరజ్ చోప్రా తన ఈటెను 90.23 మీటర్లు విసిరి ఈ రికార్డ్ సృష్టించాడు. ఇప్పటి వరకు నీరజ్ అత్యుత్తమ ప్రదర్శన 89.94 మీటర్లు. 2022లో స్టాక్ హోమ్ డైమండ్ లీగ్‌లో నీరజ్ ఈ ప్రదర్శన చేశాడు. దోహాలో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన నీరజ్ అందుకు తగినట్లుగానే మంచి ఆరంభం అందించాడు. మొదటి రౌండ్‌లోనే 88.84 మీటర్లు విసిరాడు. రెండో రౌండ్‌లోనూ బాగానే విసిరినా, అది ఫౌల్ అయింది. ఇక మూడో రౌండ్‌లో తన కెరీర్ బెస్ట్‌ను అందించాడు. ఏకంగా 90+ మీటర్లు విసరడం విశేషం. అయితే జర్మనీ ప్లేయర్ జులియన్ వెబర్ (91.06 మీటర్లు) చివరి రౌండ్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. దీంతో నీరజ్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
Neeraj Chopra joins the 90M 𝐂𝐋𝐔𝐁 🔥 👏 🇮🇳 Neeraj Chopra finally broke the 90m barrier for the first time in his career, with a throw of 90.23 at the Doha Diamond League. #NeerajChopra pic.twitter.com/zopYfa45Xk
— Doordarshan Sports (@ddsportschannel) May 16, 2025