MCA Umpire Dies Mid Match : మ్యాచ్ మధ్యలో ముంబయి క్రికెట్ అసోషియేషన్-ఎంసీఏ అంపైర్ ప్రసాద్ మల్గోంకర్ (60) మృతిచెందారు. అండర్-19 బామ కప్పులో భాగంగా సుందర్ క్రికెట్ క్లబ్ గ్రౌండ్లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఈ విషాదం ఘటన జరిగింది.
KRP XI CC, క్రెసంట్ CC జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ప్రసాద్ అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు విడిచారు. గుండెపోటుతోనే ప్రసాద్ మరణించినట్లు అసోషియేషన్ వర్గాలు భావిస్తున్నాయి. 11వ ఓవర్లో రెండు బంతులు వేసిన తర్వాత ఈ ఘటన జరిగింది. అయితే ఉదయం కొంచెం సుస్తిగా ఉందని చెప్పిన ఆయన, ఆ తర్వాత మ్యాచ్‌లో అంపైర్‌గా వచ్చారు.
జాతీయ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం, ఈ ఘటన జరిగిన తర్వాత ఎంసీఏ కోఆర్డినేటర్ దత్తా మిత్బావ్కర్ వెంటనే స్పందించారు. తోటి అధికారులను అప్రమత్తం చేసి సహాయక చర్యలను వేగవంతం చేశారు. "ఇబ్రహీం సర్- సల్మాన్ ఖాన్, బరున్ సా, ప్రవీణ్ భాయ్ వంటి ఆటగాళ్ల సహాయంతో మేము ప్రసాద్‌ను మైదానం నుంచి నేషనల్ CCకి చార్పాయ్(చెక్క మంచము వంటిది) మీద తీసుకెళ్లాము. అక్కడి నుంచి హుటాహుటిన ట్యాక్సీలో బాంబే ఆస్పత్రికి తరలించాము. దురదృష్టవశాత్తు, మేము ఆస్పత్రికి చేరుకునేలోపే ప్రసాద్ మరణించి ఉంటాడు." అని దత్తా మిత్బావ్కర్ తెలిపారు.
అయితే ఆస్పత్రికి తీసుకొచ్చేలోపే ప్రసాద్ మరణించాడని వైద్యులు ధ్రువీకరించారు. అనంతరం తమ వ్యక్తిగత వైద్యుడు ఇచ్చిన మరణ ధ్రువీకరణ పత్రాన్ని ఆస్పత్రిలో సమర్పించారు ప్రాసాద్ కుటుంబ సభ్యులు. దీంతో ఆస్పత్రి సిబ్బంది పోస్టుమార్టం చేయకుండా మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
'మ్యాచ్‌కు ముందు ఇబ్బందిగా ఉందన్నాడు'
"టాస్ వేసే ముందు తనకు కొంత యాసిడిటీగా ఉందని అతడు నాకు చెప్పాడు. నేను అతడ్ని విశ్రాంతి తీసుకోమని అడిగాను. కానీ అతను దానిని తట్టుకుంటానన్నాడు. మొదటి పది ఓవర్లు వేసినప్పుడు ప్రసాద్ బాగానే ఉన్నాడు, కానీ అకస్మాత్తుగా 10.2 ఓవర్లలో అతను కుప్పకూలిపోయాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు" అని ప్రసాద్ తోటి అంపైర్ పార్థమేశ్ అనగే తెలిపారు.
బ్యాటర్ స్ట్రెయిట్ డ్రైవ్ - బంతి తగిలి అంపైర్ ముఖంపై తీవ్ర గాయాలు
లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన అంపైర్- ఆగిపోయిన టెస్ట్ మ్యాచ్! వీడియో వైరల్