Rohit Sharma Stand : టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మక వాంఖడే స్టేడియంలో ఓ స్టాండ్‌కు అధికారికంగా రోహిత్ శర్మ పేరు పెట్టారు. ముంబయి క్రికెట్ అసోసియేషన్ శుక్రవారం ఈ కార్యక్రమాన్ని గ్రాండ్‌గా నిర్వహించింది. ఈ ఈవెంట్‌కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, రోహిత్ తల్లిదండ్రులు గురునాథ్‌శర్మ, పూర్ణిమ హాజరయ్యారు. సీఎం ఫడణవీస్‌తో కలిసి రోహిత్ తల్లిదండ్రులు ఈ స్టాండ్‌ను ఆవిష్కరించారు.
ప్రత్యేక అనుభూతి
తన పేరుతో ఓ స్టాండ్ ఉన్న స్టేడియంలో మ్యాచ్‌లు ఆడబోతుండడం ప్రత్యేక అనుభూతి అని రోహిత్ అన్నాడు. క్రికెట్ స్టేడియంలో తన పేరిట ఓ స్టాండ్ పెడతారని కలలో కూడా ఊహించలేదని రోహిత్ అన్నాడు. 'క్రికెట్ స్టేడియంలో ఓ స్టాండ్‌కు నా పేరు పెడతారని నేను కలలో కూడా అనుకోలేదు. వాంఖడే లాంటి ప్రతిష్ఠాత్మక స్టేడియంలో ఎందరో దిగ్గజాల సరసన నా పేరు ఓ స్టాండ్‌కు ఉండడం ఆనందాన్ని కలిగిస్తోంది. నా ఫ్యామిలీ, సన్నిహితుల మధ్య ఈ ఈవెంట్ జరగడం మరింత సంతోషంగా ఉంది. ఈ ఐపీఎల్‌లో మే 21న ఇక్కడే మ్యాచ్ ఆడబోతుండడం జీవితంలో కొత్త అనుభూతిగా మిగలనుంది. టీమ్ఇండియాకు ప్రాతినిథ్యం వహిస్తూ ఈ మైదానంలో ఆడుతున్నప్పుడు మరింత ప్రత్యేకంగా అనిపిస్తుంది' అని రోహిత్ పేర్కొన్నాడు.
MOMENTS OF THE DAY. ❤️
— Tanuj (@ImTanujSingh) May 16, 2025
- Rohit Sharma called his parents & he himself came and took his parents to the stage for unveil the stand. 🥹 (ANI). pic.twitter.com/2zGLDoOM5p
రితిక ఎమోషనల్
ఈ స్టాండ్‌ను ఆవిష్కరణ సందర్భంగా రోహిత్ సతీమణి రితికా శర్మ భావోద్వేగానికి గురయ్యారు. ఆనందంలో స్టేజ్‌పైనే ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. రోహిత్ మాట్లాడుతుండగా తన పేరెంట్స్ కూడా కాస్త ఎమోషనల్ అయ్యారు. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ ఐపీఎల్‌లో రోహిత్ ఫర్వాలేదనిపిస్తున్నాడు. ఇప్పటివరకు 11 మ్యాచ్‌ల్లో 300 పరుగులతో రాణించాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ముంబయి ఇంకా లీగ్ స్టేజ్‌లో 2 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అందులో దిల్లీ క్యాపిటల్స్‌తో మే 21 వాంఖడేలోనే మ్యాచ్ జరగనుంది. రోహిత్ స్టాండ్ ఆవిష్కరణ తర్వాత రోహిత్ తొలిసారి ఈ మ్యాచ్‌తోనే బరిలో దిగనున్నాడు.
రోహిత్, విరాట్‌కు BCCI గుడ్‌న్యూస్- స్టార్ ప్లేయర్లకు ఆ గౌరవం!