Shardul Thakur LSG : లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ పేస్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ ఐపీఎల్ కామెంటేటర్లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. విమర్శలు చేసేవాళ్లు ముందుగా తమ గణాంకాలు ఒక్కసారి చూసుకొని మాట్లాడాలని అన్నాడు. ఈ మధ్య కామెంటేటర్లు బౌలర్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారని శార్దూల్ అభిప్రాయపడ్డాడు. శనివారం లఖ్‌నవూ- గుజరాత్ మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు.
'ఈ సీజన్లో మేం బౌలింగ్‌లో బాగానే రాణిస్తున్నాం. కానీ, కామెంటరీ బాక్స్‌లో కూర్చున్న వాళ్ల మాత్రం బౌలర్లను టార్గెట్ చేస్తున్నారు. మా పట్ల కఠినంగా ఉంటున్నారు. ఈ రోజుల్లో టీ20 క్రికెట్లో 200 స్కోర్ సాధించడం సాధారణ విషయం అయ్యిందని గుర్తించాలి. స్టూడియోలో కూర్చొని ఇతరుల బౌలింగ్‌ను విమర్శించడం చాలా ఈజీనే. కానీ, గ్రౌండ్లో పరిస్థితుల గురించి వాళ్లకేం తెలీదు. ఎవరినైనా విమర్శించే ముందు ఓసారి తమతమ గణాంకాలు చూసుకొని మాట్లాడితే బెటర్' అని శార్దూల్ పేర్కొన్నాడు.
అనుకోకుండా వచ్చి
ఈ సీజన్లో శార్దూల్ అనూహ్యంగా చోటు దక్కించుకున్నాడు. మెగా వేలంలో అన్‌సోల్డ్‌గా మిలిగిపోయిన శార్దూల్, టోర్నీ ప్రారంభానికి ముందు మొహ్సిన్ స్థానంలో ఎంపికయ్యాడు. అలా వచ్చిన శార్దూల్ ప్రస్తుత సీజన్లో తన బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌ల్లో 11 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఈ క్రమంలోనే టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన లిస్ట్‌లో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన శార్దూల్ 34 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలోనే శార్దూల్ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో 200 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. దీంతో ఈ మైలురాయి అందుకున్న 18వ భారత బౌలర్‌గా, ఓవరాల్‌గా 103వ ప్లేయర్‌గా నిలిచాడు. కాగా ఈ లిస్ట్‌లో స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ అగ్రస్థానం (315 వికెట్లు)లో ఉండగా, జస్ప్రీత్ బుమ్రా రెండో ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. స్పిన్నర్లలో యుజ్వేంద్ర చాహల్ 365 వికెట్లతో టాప్‌లో ఉన్నాడు.
Thakur sahab on 🔥 pic.twitter.com/HU8rreBHVF
— Lucknow Super Giants (@LucknowIPL) April 12, 2025
🔝 Catch
— IndianPremierLeague (@IPL) April 12, 2025
🔝 Celebration
🔝 Wicket
🎥 Shardul Thakur's brilliant grab that brought out Digvesh Rathi's trademark celebration ™️
Updates ▶ https://t.co/VILHBLEerV #TATAIPL | #LSGvGT | @LucknowIPL pic.twitter.com/wlTRAw3ASV
లఖ్‌నవూ ఆల్‌రౌండ్ షో- గుజరాత్‌పై గ్రాండ్ విక్టరీ
ధోనీని అన్‌ఫాలో కొట్టేసిన రుతురాజ్?- IPLలో ఇప్పుడిదే హాట్ టాపిక్!