ETV Bharat / sports

పారిస్ ఒలింపిక్స్​కు ఎండ్ కార్డ్- నెక్ట్స్ స్టాప్ లాస్‌ఏంజెలెస్‌- 2028లో క్రికెట్ కూడా - Olympics 2028

Los Angeles Olympics 2028: పారిస్ ఒలింపిక్స్ సంబరాలు ముగిశాయి. ఇక అందరి దృష్టి 2028 విశ్వక్రీడలపైనే. 2028 క్రీడలకు లాస్‌ఏంజెలెస్‌ ఆతిథ్యమివ్వనుంది.

author img

By ETV Bharat Sports Team

Published : Aug 12, 2024, 6:49 AM IST

Los Angeles  Olympics 2028
Los Angeles Olympics 2028 (Source: Ascoiated Press)

Los Angeles Olympics 2028: పారిస్ ఒలింపిక్స్ సంబరాలు ముగిశాయి. ఎన్నో సంచలనాలు, మరెనో రికార్డులతోపాటు పలు వివాదాలతో 2024 ఒలింపిక్స్​ గేమ్స్​కు ఎండ్ కార్డ్ పడింది. ఈ విశ్వ క్రీడలు దాదాపు రెండు వారాలు క్రీడా ప్రపంచాన్ని ఉర్రూతలూగించాయి. మరి తర్వాత ఏంటి? ఇక అందరి దృష్టి 2028 విశ్వక్రీడలపైనే. లాస్‌ఏంజెలెస్‌ వేదికగా 2028 ఒలింపిక్స్​ క్రీడలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పారిస్ ముగింపు వేడుకల్లో ఐవోసీ ప్రెసిడెంట్ థామస్ ఒలింపిక్ పతకాన్ని లాస్ఏంజెలెస్ మేయర్​ కారెన్​కు అందించారు. ఇక 2028 ఒలింపిక్స్‌ను ఇంతకంటే ఘనంగా నిర్వహించేందుకు అమెరికా ఇప్పటికే కసరత్తులు మొదలెట్టింది. ఆటలకు హాలీవుడ్‌ గ్లామర్‌ను అద్దనుంది.

అమెరికా మూడోసారి
ఈ విశ్వక్రీడలకు ఆతిథ్యమిచ్చిన పారిస్‌ నుంచి మూడోసారి ఆతిథ్య నగరంగా మారబోతున్న లాస్‌ఏంజెలెస్‌ ఒలింపిక్‌ పతాకాన్ని అందుకుంది. ఇప్పటివరకూ లండన్‌ (1908, 1948, 2012), పారిస్‌ (1900, 1924, 2024) మాత్రమే ఒలింపిక్స్‌కు మూడు సార్లు ఆతిథ్యమిచ్చాయి. ఈ లిస్ట్​లో లాస్‌ఏంజెలెస్‌ కూడా చేరబోతుంది. అమెరికా నగరంలో గతంలో 1932, 1984 ఒలింపిక్స్‌ జరిగాయి.

44 ఏళ్ల తర్వాత మరోసారి విశ్వక్రీడలకు ఆతిథ్యమివ్వబోతున్న ఈ నగరం క్రీడలను అత్యుత్తమంగా నిర్వహించాలనే ప్రణాళికతో ఉంది. పసిఫిక్‌ మహాసముద్రం, బీచ్‌లు, ఆకట్టుకునే వీధులతో క్రీడా ప్రపంచాన్ని మంత్రముగ్దులను చేసేందుకు లాస్‌ఏంజెలెస్‌ సమయాత్తమవుతోంది. పారిస్‌ లాగే లాస్‌ఏంజెలెస్‌ కూడా ఒలింపిక్స్‌ కోసం ఎక్కువగా కొత్త నిర్మాణాలు చేపట్టడం లేదు. 2028 జులై 14న ప్రారంభమయ్యే ఈ ఒలింపిక్స్‌ క్రీడలు జులై 30న ముగుస్తాయి.

క్రికెట్‌ మళ్లీ: దాదాపు 128ఏళ్ల తర్వాత ఒలింపిక్స్​లో మళ్లీ క్రికెట్ గేమ్ చూడబోతున్నాం. ఒలింపిక్స్​లో 1900సంవత్సరంలో చివరిసారిగా క్రికెట్ జరిగింది. ఇక లాస్‌ఏంజెలెస్‌లో క్రికెట్ రీ ఎంట్రీ ఇవ్వనుంది. విశ్వ క్రీడల్లో టీ20 ఫార్మాట్​లో క్రికెట్ జరగనుంది. ఇకపై ఒలింపిక్స్​లో భారత్ పతకం ఆశించే క్రీడా లిస్ట్​లో క్రికెట్ చేరనుంది. మరో పురాతన క్రీడ లాక్రాస్‌ కూడా పునరాగమనం చేయబోతుంది. చివరగా 1908లో ఈ క్రీడా పోటీలు జరిగాయి. పారిస్‌లో నిర్వహించని బేస్‌బాల్‌/సాఫ్ట్‌బాల్‌ తిరిగి రానుంది. మరోవైపు స్క్వాష్, ఫ్లాగ్‌ ఫుట్‌బాల్‌ ఒలింపిక్‌ అరంగేట్రం చేయనున్నాయి.

విమర్శలకు గోల్డ్ మెడలిస్ట్​ స్ట్రాంగ్ రిప్లై- ఆన్​లైన్ వేధింపులపై ఇమానె ఫిర్యాదు! - Paris Olympics 2024

పారిస్ ఒలింపిక్స్: భారత్ ఖాతాలో 6 పతకాలు​- త్రుటిలో చేజారినవి ఎన్నో తెలుసా? - Paris Olympics 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.