ETV Bharat / sports

రాహుల్ బర్త్​డే సర్​ప్రైజ్- కూతురు పేరు రివీల్ చేసిన క్రికెటర్ - KL RAHUL

కేఎల్ రాహుల్ కూతురు నామకరణం- చిన్నారి పేరు ఏంటంటే?

KL Rahul Daughter Name
KL Rahul Daughter Name (Source : Athiya Shetty Instagram)
author img

By ETV Bharat Sports Team

Published : April 18, 2025 at 3:33 PM IST

2 Min Read

KL Rahul Daughter Name : స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ శుక్రవారం (ఏప్రిల్ 18) 33వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో రాహుల్​కు అభిమానులు, సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక రాహుల్ కూడా ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని చిన్న సర్​ప్రైజ్ ఇచ్చాడు. తమ కుమార్తె పేరును రివీల్ చేశాడు. చిన్నారికి 'ఇవారా విపుల రాహుల్' (Evaarah, V.R.) అని నామకరణం చేసినట్లు పేర్కొన్నాడు.

ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ క్యూట్ పోస్ట్ షేర్ చేశాడు. భార్య అతియా శెట్టి, కూతుకు ఇవారాతో ఉన్న ఫొటోను రాహుల్ పోస్ట్ చేశాడు. 'మా బేబీ గర్ల్. మా ప్రపంచం. ఇవారా భగవంతుడి కానుక' అని క్యాప్షన్ రాసుకొచ్చారు. ఈ పోస్ట్ నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. దీంతో రాహుల్‌- అతియా జంటకు అభిమానులు మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇదే అర్థం
అయితే ఇవారా పేరుకు అర్థం కూడా ఈ జంట వెల్లడించింది. 'ఇవారా' అంటే భగవంతుని కానుక అని, అలాగే 'విపుల'కు అర్థం సంరక్షకుడు అని అతియా శెట్టి ఇన్​స్టాగ్రామ్​ స్టోరీలో పోస్ట్ షేర్ చేశారు. ఇక చివర ఉన్న రాహుల్ తన తండ్రి పేరు అని అతియా రాసుకొచ్చారు. కాగా, రాహుల్- అతియా జంట మార్చి 24న తల్లిదండ్రులయ్యారు. రాహుల్ సతీమణి సతీమణి అతియా శెట్టి పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చారు. ఇక రాహుల్- అతియా 2023 జనవరి 23న వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

ఇక రాహుల్ ప్రస్తుతం ఐపీఎల్​లో బిజీగా ఉన్నాడు. భార్య ప్రసవం నేపథ్యంలో ఈ సీజన్‌లో దిల్లీ ఆడిన తొలి మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. రెండో మ్యాచ్​ నుంచి రాహుల్ జట్టుతో జాయిన్ అయ్యాడు. దిల్లీ క్యాపిటల్స్​కు ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్ 5 మ్యాచ్​ల్లోనే 59.50 సగటుతో 238 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా, దిల్లీ ఏప్రిల్ 19 (శనివారం) గుజరాత్ టైటాన్స్​తో తలపడనుంది. ఈ మ్యాచ్​ అహ్మదాబాద్ వేదికగా జరగనుంది.

'నేను పక్కా లోకల్'- RCBపై రాహుల్ ఫుల్ ఫైర్!

కేఎల్ రాహుల్​కు తండ్రిగా ప్రమోషన్- ఆడ బిడ్డకు జన్మనిచ్చిన అతియాశెట్టి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.