KL Rahul vs RCB : చిన్నస్వామి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో గురువారం జరిగిన మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్ 6వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ విజయంలో దిల్లీ ప్లేయర్ కేఎల్ రాహుల్ (93* పరుగులు) కీలక ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. తనదైన క్లాస్ బ్యాటింగ్‌తో ఆర్సీబీకి విజయాన్ని దూరం చేశాడు. అయితే గ్రౌండ్లో ఎప్పుడూ సైలెంట్‌గా ఉండే రాహుల్ తాజా మ్యాచ్ అనంతరం ఉగ్రరూపం చూపించాడు.
విన్నింగ్ షాట్ బాదిన తర్వాత అతడు అగ్రెసివ్‌గా సంబరాలు చేసుకున్నాడు. బ్యాట్‌తో మైదానంలో సర్కిల్ గీస్తూ, 'ఇది నా హోం గ్రౌండ్' అని అర్థం వచ్చేలా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఈ సమయంలో రాహుల్ ఫుల్ ఫైర్‌లో కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంబరాలు ఎవరిని ఉద్దేశించి చేసుకున్నాడో అంటూ నెట్టింట చర్చ మొదలైంది. మరోవైపు 'లోకల్ బాయ్ రాహుల్' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
KL Rahul - Mr. Consistent Silence the noise, let the bat talk.
— Indian Cricket Fc (@Jonathan_fcc) April 11, 2025
This Is His Ground Cold Celebration By Kl Rahul.#KLRahul #RCBvsDC #ViratKohli
pic.twitter.com/kyCv8RW9Iv
అయితే చిన్నస్వామి తన హోం గ్రౌండ్ అని, ఇక్కడ ఎలా ఆడాలో తనకు బాగా తెలుసని రాహుల్ మ్యాచ్ అనంతరం చెప్పాడు. ' స్టేడియం చిన్నదే కానీ, పిచ్ మాత్రం ఛాలెంజింగ్‌గా. తొలుత 20 ఓవర్లు వికెట్ కీపింగ్ చేయడం వల్ల నాకు కలిసొచ్చింది. ఇక్కడ ఎలా ఆడాలో అర్థమైంది. బంతి నెమ్మదిగా వస్తుందని అనిపించింది. మంచి ఓపెనింగ్ దక్కితే చాలని అనుకున్నా. నేను భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నిస్తే వారికి ఏది టార్గెట్ అవుతుందనేది తెలుసు. అందుకే మొదట్లో నెమ్మదిగా ఆడాల్సి వచ్చింది. నా క్యాచ్‌ను వదిలేయడం కూడా కలిసొచ్చింది. ఇది నా గ్రౌండ్. నా హోమ్. నాకంటే ఇంకెవరికి ఇక్కడి పరిస్థితులు తెలుస్తాయి. చిన్నస్వామిలో ఆడడాన్ని ఎప్పుడూ ఆస్వాదిస్తా' అని రాహుల్ అన్నాడు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే, ఆర్సీబీ నిర్దేశించిన 164 పరుగుల టార్గెట్‌ను దిల్లీ 17.5 ఓవర్లలోనే ఛేదించింది. రాహుల్ (91), ట్రస్టన్ స్టబ్స్ (38*) రాణించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 7 వికెట్లకు 163 పరుగులు చేసింది.
KL RAHUL REDEMPTION IN T20I . #KLRahulpic.twitter.com/py2h0HX1yQ
— -𝚉𝙰𝙳𝙾𝙽 🇮🇳 (@_zadon_) April 10, 2025
అదరగొట్టిన కేఎల్ రాహుల్ - ఆర్సీబీపై దిల్లీ గెలుపు- వరుసగా నాలుగో విజయం
CSK హ్యాట్రిక్ ఓటమి - కేఎల్ రాహుల్ సూపర్ ఇన్నింగ్స్ - దిల్లీ ఘన విజయం