SRH Vs CSK Kavya Maran: ఐపీఎల్ 2025లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించిన విషయం తెలిసిందే. చెపాక్‌లో తొలి గెలుపు సాధించింది హైదరాబాద్ టీమ్. అయితే హోం గ్రౌండ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే 154 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో 155 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్ 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
అయితే మ్యాచ్ మధ్యలో ఎస్‌ఆర్‌హెచ్ ఓనర్ కావ్య మారన్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్తోపాటు ఆమె ఫ్రస్టేషన్‌కు గురైన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కావ్య ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ ఎప్పుడూ హైలెట్ అవుతూనే ఉంటాయి. ఈసారి మరింతగా చక్కర్లు కొడుతున్నాయి. నెట్టింట ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయనే చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.
ఫ్రీ హిట్ మిస్సవ్వగానే!
చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్ కమిందు మెండిస్ ఓ ఫ్రీ హిట్‌ను మిస్ చేసుకున్నాడు. ఆ క్రెడిట్ సీఎస్‌కే స్టార్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీదే. దీంతో కావ్య ఫుల్ ఫ్రస్టేషన్‌కు గురైంది. ఒక్కసారిగా తన ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ మారిపోయాయి. ఛీ అదేం బ్యాటింగ్ రా బాబు, మంచి ఫ్రీ హిట్‌ను మిస్ చేసుకున్నావ్గా అన్నట్లు ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చి ఇప్పుడు వైరల్ అయింది. ఆ ఎక్స్‌ప్రెషన్స్‌కు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
The reaction of Kavya Maran was epic. 🤣pic.twitter.com/k3vvxuuOmt
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 25, 2025
ఐదు మ్యాచ్‌ల్లో గెలిస్తేనే!
ఏదేమైనా మ్యాచ్ గెలవడంతో ఫుల్ ఖుషీ అయిపోయింది కావ్య. కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో హైదరాబాద్ టీమ్ నెగ్గడంతో ఊపిరి పీల్చుకున్నట్లు కనిపించింది. ఆ విజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 6 పాయింట్లకు చేరుకుంది. మొత్తం 9 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. అయినా కూడా ఎస్‌ఆర్‌హెచ్ మిగిలిన ఐదు మ్యాచ్‌ల్లో గెలిస్తేనే ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది.
కాబట్టి రాబోయే ప్రతి మ్యాచ్ సైతం ఎస్‌ఆర్‌హెచ్‌కు డూ ఆర్ డై మ్యాచులేని చెప్పాలి. గత సీజన్‌లో ఆర్సీబీ కూడా దాదాపు ఇలాంటి పరిస్థితుల్లోనే వరుసగా మ్యాచ్‌లు గెలుస్తూ ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. ఇటీవల ఎస్‌ఆర్‌హెచ్ ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి, ఆర్సీబీని స్ఫూర్తిగా తీసుకుంటామని చెప్పాడు. కాబట్టి 2025 సీజన్‌లో హైదరాబాద్ ఏం చేస్తుందనే ఇప్పుడు ఆసక్తికరం.
ధోనీ సూపర్ రికార్డ్- ఎలైట్ లిస్ట్‌లో రోహిత్, విరాట్ సరసన
IPL శాలరీ రూల్స్- ఒక్క మ్యాచ్ మిస్సైతే ఎంత కట్ అవుతుందో తెలుసా?