ETV Bharat / sports

భారత్​పై బాల్ టాంపరింగ్ ఆరోపణలు- అంపైర్​పై ఇషాన్ కిషన్ ఫైర్- క్లారిటీ ఇచ్చిన ఆస్ట్రేలియా!

టీమ్ఇండియాపై బాల్ టాంపరింగ్ ఆరోపణలు- అంపైర్​పై ఇషాన్ కిషన్ ఫైర్-

India A Ball Tampering Controversy
India A Ball Tampering Controversy (Source: Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : Nov 3, 2024, 11:18 AM IST

India A Ball Tampering Controversy : భారత్ ఎ జట్టు రెండు అనధికార టెస్టుల కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఈ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్​గా ఉన్నాడు. ఈ పర్యటనలో ఆస్ట్రేలియా ఎ జట్టుతో జరిగిన అనధికార తొలి టెస్టు నాలుగో రోజు ఆటలో వివాదం జరిగింది. బంతిని మార్చాలన్న అంపైర్ నిర్ణయాన్ని టీమ్ఇండియా బ్యాటర్ ఇషాన్ కిషన్ తప్పుబట్టాడు. ఈ క్రమంలో ఫీల్డ్ అంపైర్ టీమ్‌ఇండియా ఆటగాళ్లను ఉద్దేశించి బాల్ టాంపరింగ్‌ ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది.

దీంతో మైదానంలోనే ఇషాన్ కిషన్‌ అంపైర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. బంతిపై రుద్దినట్లు కనిపించడం వల్ల భారత ఆటగాళ్లపై అంపైర్ క్రెయిగ్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. టీమ్ఇండియా ప్లేయర్లు- అంపైర్ల మధ్య జరిగిన ఈ వాదనలు స్టంప్స్‌ మైక్స్‌లో రికార్డ్ అయ్యాయి.

'చర్చలకు తావులేదు. వెళ్లి ఆడండి. ఇక్కడ చర్చింకునేందుకు కార్యక్రమం జరగడం లేదు' అని అంపైర్ భారత ఆటగాళ్లతో అన్నాడు. దీనికి ఇషాన్ ఘాటుగా రిప్లై ఇచ్చాడు. 'మేం ఇదే బంతితో ఆడాలా? మీ నిర్ణయం అత్యంత మూర్ఖత్వం' అని ఇషాన్ అన్నాడు. 'మీ కారణంగానే బంతి పాడైంది. నువ్వే (ఇషాన్‌ను ఉద్దేశించి) స్క్రాచ్‌ చేశావు. అందువల్లే బంతి మార్చాల్సి వచ్చింది' అని అంపైర్ వెల్లడించాడు.

అలాంటిదేమీ లేదు
అయితే ఈ మ్యాచ్​లో ఎలాంటి బాల్ టాంపరింగ్ జరగలేదని క్రికెట్ ఆస్ట్రేలియా క్లారిటీ ఇచ్చింది. బంతి పూర్తిగా చెడిపోయిన కారణంగానే అంపైర్లు మార్చినట్లు పేర్కొంది. ఈ నిర్ణయాన్ని రెండు జట్ల కెప్టెన్లకు తెలియజేశారని సమాచారం. అయితే అంపైర్​తో ఇషాన్ వాదనలు స్టంప్స్ మైక్​లో రికార్డ్ అవ్వడం వల్ల ఇది చర్చనీయాంశమైంది. ఇక ప్లేయర్లపై తదుపరి ఎలాంటి చర్యలు ఉండవని జరగలేదని క్రికెట్ ఆస్ట్రేలియా స్పష్టం చేసింది.

కాగా, ఈ మ్యాచ్​లో ఆస్ట్రేలియా ఎ 7 వికెట్ల తేడాతో నెగ్గింది. భారత్ ఓడింది. టీమ్ఇండియా నిర్దేశించిన 225 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇక ఇరుజట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ మెల్​బోర్న్ వేదికగా నవంబర్ 7న ప్రారంభం కానుంది.

స్కోర్లు

  • భారత్ ఎ : 107 & 312
  • ఆస్ట్రేలియా ఎ : 195 & 226/3

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.