ETV Bharat / sports

IPL పర్పుల్​ క్యాప్ హీరోస్- బంతి పట్టారంటే వికెట్ పడాల్సిందే! - IPL 2025

మెగా టోర్నీలో అత్యధిక వికెట్లు- పర్పుల్ క్యాప్ విజేతలు వీళ్లే!

IPL Purple Cap Winners
IPL Purple Cap Winners (Source : ANI)
author img

By ETV Bharat Sports Team

Published : March 16, 2025 at 5:30 PM IST

2 Min Read

IPL Purple Cap Winners All Seasons : ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్​కు ఉండే క్రేజే వేరు. క్రికెటర్లందరూ ఈ క్యాష్ రిచ్ లీగ్​లో ఆడాలను కోరుకుంటారు. 2008లో ప్రారంభమైన ఐపీఎల్ ఇప్పటివరకు 17 సీజన్లు పూర్తి చేసుకుంది. 18వ ఎడిషన్ మార్చి 22న ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన ప్లేయర్​కు పర్పుల్ క్యాప్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో గడిచిన 17 సీజన్లలో పర్పుల్ క్యాప్ విజేతలు ఎవరు? ఎవరు సింగిల్ సీజన్​లో అత్యధిక వికెట్లు పడగొట్టారో తెలుసుకుందాం.

ఐపీఎల్ పర్పుల్ క్యాప్ విన్నర్స్

  • ఐపీఎల్ తొలి సీజన్​లో రాజస్థాన్ రాయల్స్ పేసర్ సోహైల్ తన్వీర్ 11 మ్యాచ్‍ల్లో 22 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో ఐపీఎల్​లో మొదటి పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు
  • ఐపీఎల్ 2009 సీజన్​లో దక్కన్ ఛార్జర్స్ పేసర్ ఆర్పీ సింగ్ (23) పర్పుల్ క్యాప్ అందుకున్నాడు
  • 2010 ఎడిషన్​లో దక్కన్ ఛార్జర్స్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా (21) పర్పుల్ క్యాప్ కైవసం చేసుకున్నాడు
  • 2011 ఐపీఎల్ సీజన్​లో ముంబయి పేసర్ లసిత్ మలింగ (28) పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు
  • 2012లో దిల్లీ డేర్ డెవిల్స్ బౌలర్ మోర్నీ మార్కెల్ (25) అత్యధిక వికెట్ టేకర్​గా నిలిచాడు
  • 2013 సీజన్​లో చెన్నై పేసర్ డ్వేన్ బ్రావో (32) పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. సింగిల్ సీజన్​లో అత్యధిక వికెట్లు పడొగొట్టిన రికార్డు బ్రావో పేరిటే ఉంది
  • 2014లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ మోహిత్ శర్మ 16 మ్యాచ్​ల్లో 23 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ విన్నర్ అయ్యాడు
  • 2015 ఐపీఎల్ సీజన్​లోనూ డ్వేన్ బ్రావోనే పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు. ఈ సీజన్​లో అతడు 26 వికెట్లు నేలకూల్చాడు
  • 2016లో సన్ రైజర్స్ పేసర్ భువనేశ్వర్ (23) తొలిసారి పర్పుల్ దక్కించుకున్నాడు
  • 2017లోనూ పర్పుల్ క్యాప్ భూవీనే వరించింది. ఈ ఎడిషన్​లో అతడు 26 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ విజేతగా నిలిటాడు
  • ఐపీఎల్ 2018 సీజన్​లో పంజాబ్ కింగ్స్ పేసర్ ఆండ్రూ టై (24) పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్నాడు
  • 2019లో చెన్నై స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ (26) పర్పుల్ క్యాప్ విజేతగా నిలిచాడు
  • 2020 సీజన్​లో దిల్లీ క్యాపిటల్స్ పేసర్ కగిసో రబాడా (30) వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు
  • 2021 ఐపీఎల్ సీజన్​లో ఆర్సీబీ ప్లేయర్ హర్షల్ పటేల్ (32) పర్పుల్ క్యాప్ అందుకున్నాడు
  • 2022 ఎడిషన్​లో రాజస్థాన్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ 27 వికెట్లతో అదరగొట్టి పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు
  • ఐపీఎల్ 2023 సీజన్​లో గుజరాత్ టైటాన్స్ పేసర్ మహ్మద్ షమీ (28) పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు
  • 2024 ఎడిషన్​లో పంజాబ్ కింగ్స్ పేసర్ హర్షల్ పటేల్ (24) పర్పుల్ క్యాప్ అందుకున్నాడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.