IPL Player Salary Rules : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో కేవలం మ్యాచ్‌లే కాదు ఫ్యాన్స్‌కి ఆసక్తి కలిగించే అంశాలు చాలా ఉంటాయి. ఐపీఎల్ ప్రారంభం కాకముందు నుంచి పూర్తయ్యే వరకు ఈ అప్డేట్‌లు ఫ్యాన్స్‌కి షాక్ ఇస్తుంటాయి. ముఖ్యంగా ప్లేయర్లకు అందించే శాలరీపై చాలా డౌట్స్ ఉంటాయి. వేలంలో ఓ ఆటగాడిని ఫ్రాంచైజీ ఎంతకైతే బిడ్ వేసి కొంటుందో అదే ఆ ప్లేయర్ శాలరీ అవుతుంది. గత మెగా వేలంలో చాలా మంది రికార్ఢు స్థాయి ధరలు పలికారు.
అత్యధికంగా పంత్ దాదాపు రూ.27 కోట్లు అందుకున్నాడు. అలా వేలంలో రూ.కోట్లు పలికిన కొందరు ప్లేయర్లు ఇప్పటి వరకు కనీసం ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అలానే కొందరు అప్పుడప్పుడు మ్యాచ్‌లకి దూరం అవుతున్నారు. అలాంటప్పుడు వీరికి మొత్తం శాలరీ చెల్లిస్తారా? లేదా? ఏమైనా కటింగ్స్ ఉంటాయా అనే డౌట్ వచ్చిందా? అయితే సమాధానం తెలుసుకుందాం పదండి.
శాలరీ తగ్గిస్తారా?
ఓ ప్లేయర్ సీజన్ మొత్తానికి అందుబాటులో ఉన్నాడా? లేదా? అనే దానిపై ఆధారపడి అతడికి జీతం చెల్లిస్తారు. మ్యాచ్‌లు ఆడిన దానితో సంబంధం లేదు. అంటే ప్లేయర్ సీజన్ మొత్తం అందుబాటులో ఉండి, జట్టుతో ట్రావెల్ చెస్తే ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోయినా అతనికి నష్టం లేదు. ఎందుకంటే ఫ్రాంచైజీ రూల్స్ మేరకు సదరు ప్లేయర్‌కు వేలంలో పాటిన మొత్తాన్ని ఎలాంటి కటింగ్స్ లేకుండా పూర్తిగా చెల్లిస్తుంది.
అలా అయితే కటింగ్సే!
అయితే గాయం, వ్యక్తిగత కారణాలు లేదా వారి జాతీయ జట్టు అవసరాల కారణంగా సీజన్‌లో కొంత భాగం మాత్రమే ఆటగాడు అందుబాటులో ఉంటే వారికి పూర్తి జీతం అందదు. అంటే పలుమార్లు ఆలస్యంగా లీగ్‌లోకి రావడం లేదా ముందుగా వెళ్లిపోవడం వంటివి జరుగుతాయి. వీరికి అందుబాటులో ఉన్న మ్యాచ్‌ల సంఖ్య లేదా రోజుల సంఖ్య (దీన్ని ప్రో- రేటా పేమెంట్ అంటారు) ఆధారంగా చెల్లిస్తారు. దీనికి ఫిక్స్‌డ్ రిటైనర్ కూడా యాడ్ అవుతుంది. ఇది సాధారణంగా అసలు జీతంలో 10% ఉండవచ్చు.
సీజన్‌కి ముందే గాయంతో లీగ్‌కి దూరమైతే ఫ్రాంచైజీ జీతం చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆటగాడు టోర్నమెంట్ సమయంలో గాయపడితే, ఫ్రాంచైజీ మెడికల్ ఖర్చులు భరించాలి. ఆటగాడు సీజన్‌కు అందుబాటులోనే ఉన్నాడు కాబట్టి మొత్తం జీతం అందుతుంది.
ఈఎమ్ఐలు కూడా
అయితే జీతాలు ప్లేయర్‌కి ఒకేసారి చెల్లించకపోవచ్చు. ఫ్రాంచైజీలు సాధారణంగా టోర్నమెంట్‌కు ముందు 15%, టోర్నమెంట్ సమయంలో 65%. పూర్తయ్యాక 20% ఇవ్వవచ్చు. వాయిదాల రూపంలో చెల్లించవచ్చేమో గానీ అందుబాటులో ఉన్న ఆటగాడికి మొత్తం శాలరీ అందించాల్సిందే.
హ్యాపీ బర్త్‌డే IPL- క్యాష్ రిచ్ లీగ్‌కు 18ఏళ్లు- హిస్టరీలో టాప్ పెర్ఫార్మర్స్
IPL ఆరెంజ్ క్యాప్ రికార్డ్- వరుసగా 2 సార్లు ఆ ఒక్కడికే- విరాట్, వార్నర్ కాదు!