ETV Bharat / sports

ఐపీఎల్ హిస్టరీలో సూపర్ కెప్టెన్స్ - ఒక్క మ్యాచ్‌ కూడా ఓడలేదు! - IPL Captains Who Never Lost a Match

IPL Captains Who Never Lost a Match : ఐపీఎల్‌ హిస్టరీలో బెస్ట్‌ కెప్టెన్లు అంటే చాలా మంది రోహిత్‌, ధోని పేర్లు చెబుతారు? మరి ఓటమే ఎరుగని కెప్టెన్‌ ఎవరంటే? ఒక్కరు కాదు అలాంటి ప్లేయర్లు ముగ్గురు ఉన్నారు. ఇంతకీ వారెవరో చూద్దామా.

author img

By ETV Bharat Sports Team

Published : Sep 11, 2024, 9:54 AM IST

IPL Captains Who Never Lost a Match
IPL Captains Who Never Lost a Match (Getty Images)

IPL Captains Who Never Lost a Match : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్​) ఎల్లప్పుడూ క్రికెట్‌ అభిమానులకు అన్‌లిమిటెడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందజేస్తూ సక్సెస్​ అవుతోంది. కొన్ని సార్లు ఈ లీగ్​లో ఒక్క బంతి, ఒక్క పరుగు, ఒక్క క్యాచ్‌ కూడా మ్యాచ్‌ ఫలితాలను మార్చేస్తుంటాయి. మరి అలాంటి టోర్నీలో ఓటమి ఎరగని కెప్టెన్‌లు ఉన్నారంటే నమ్మగలరా? ఐపీఎల్ హిస్టరీలో అత్యుత్తమ కెప్టెన్‌లుగా గుర్తింపు పొందిన రోహిత్‌ శర్మ, ఎంఎస్‌ ధోనికి కూడా సాధ్యం కాని ఫీట్‌ని సాధించిన కెప్టెన్‌లు ఎవరు? ఈ స్టోరీలో తెలుసుకుందాం.

నికోలస్ పూరన్, సూర్యకుమార్ యాదవ్, రాస్ టేలర్‌ ఐపీఎల్‌లో కెప్టెన్‌లుగా ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోలేదు. ఐపీఎల్‌లో తమ కంటూ ప్రత్యేక రికార్డును సొంతం చేసుకున్నారు.

సూర్యకుమార్ యాదవ్
ప్రస్తుతం సూర్యకుమార్‌ యాదవ్‌, టీమ్​ఇండియా టీ20 కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. టీ20ల్లో మొదటి ర్యాంకులో కొనసాగుతున్న ఈ యంగ్ ప్లేయర్ అంతకు ముందు 2023 ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌కి కెప్టెన్సీ చేసే అవకాశం వచ్చింది. గతంలో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేని సమయంలో సూర్య కెప్టెన్​గా బాధ్యతలు స్వీకరించాడు. ఇక సూర్య నాయకత్వం వహించిన మ్యాచ్‌లో ముంబయి జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్‌ తన స్ట్రాటజీలతో కాకుండా బ్యాట్‌తో జట్టుకు విజయం అందించాడు. అలా ఈ గెలుపుతో సూర్యలో మంచి కెప్టెన్‌ అని రుజువైంది. దీంతో ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ఓడిపోని జాబితాలో సూర్య చేరాడు.

రాస్ టేలర్
న్యూజిలాండ్ లెజెండరీ క్రికెటర్‌ రాస్‌ టేలర్‌ కూడా కెప్టెన్‌గా ఐపీఎల్‌లో ఓటమి ఎరగడు. 2013 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఒకే ఒక్క మ్యాచ్‌లో టేలర్ పూణె వారియర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ మ్యాచ్‌లో పూణె వారియర్స్‌ గెలిచింది. టేలర్ ప్రశాంతంగా, అపార అనుభవంతో జట్టును నడిపించాడు. ఐపీఎల్‌లో బలమైన చెన్నై సూపర్‌ కింగ్స్‌పై విజయం సాధించాడు. ఒక గేమ్‌కు మాత్రమే కెప్టెన్‌గా ఉన్నప్పటికీ, అతని తెలివైన నిర్ణయాలు జట్టు విజయానికి తోడ్పడింది.

నికోలస్ పూరన్
వెస్టిండీస్‌ వికెట్‌ కీపర్‌- బ్యాటర్‌ నికోలస్ పూరన్, ఐపీఎల్‌లో హార్డ్‌ హిట్టర్‌గా గుర్తింపు పొందాడు. ఈ విధ్వంసకర బ్యాటర్‌కి 2024 ఐపీఎల్‌ సీజన్‌లో కెప్టెన్సీ చేసే అవకాశం కూడా లభించింది. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు కేవలం ఒక మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ మ్యాచ్‌లో లఖ్‌నవూ అద్భుతమైన విజయాన్ని సాధించింది. పూరన్‌ కెప్టెన్సీ కూడా అతడి బ్యాటింగ్ మాదిరిగానే దూకుడుగా, వ్యూహాత్మకంగా ఉంది. ఒక్క మ్యాచ్‌లోనే ఒత్తిడిని తట్టుకుని జట్టును సమర్ధవంతంగా నడిపించగలనని పూరన్ నిరూపించాడు.

ఒకే ఒక్క IPL మ్యాచ్​తో ఆ ముగ్గురి కెరీర్ ​ఫినిష్ - ఎవరంటే? - Cricketers Who Played One IPL Match

రూ.120కోట్ల పర్స్​ వ్యాల్యూ- రిటెన్షన్ ఆప్షన్​లో మార్పు- IPL 2025 మెగా వేలం! - IPL 2025 Mega Auction

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.