BCCI Income From IPL 2025 : ఐపీఎల్ సీజన్ 18 విజయవంతంగా ముగిసింది. జూన్ 3న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఓడించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న ఆర్సీబీకి రూ.20 కోట్ల భారీ ప్రైజ్ మనీ లభించింది. అలాగే టోర్నమెంట్లో పాల్గొన్న మిగతా జట్లకు కూడా అంచనాలకు మించి ఆదాయం వచ్చిందట. ఒకవైపు ఫ్రాంచైజీల ఆదాయం, మరోవైపు ఐపీఎల్ నిర్వాహకుల వల్ల బీసీసీఐకి కూడా భారీ ఆదాయం సమకూరింది.
ఐపీఎల్ ప్రసారం ద్వారా బీసీసీఐకు భారీ మొత్తంలో ఆదాయం సమకూరుతోంది. ఐపీఎల్ 18 సీజన్ ప్రసార హక్కుల కోసం బీసీసీఐకి రూ.9,678 కోట్లకు విక్రయించింది. దీంతో ప్రతి మ్యాచ్‌కు బీసీసీఐకి రూ.130.7 కోట్లకు పైగా వచ్చినట్లు అంచనాలు ఉన్నాయి. ఈసారి ఐపీఎల్ ప్రసార హక్కులు స్టార్ స్పోర్ట్స్‌కు ఉండగా, డిజిటల్ హక్కులు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వయాకామ్‌కు దక్కాయి.
యాడ్స్ ద్వారా ఆదాయంలో పెరుగుదల:
ఐపీఎల్ 2025లో ప్రకటనదారుల సంఖ్య 27% పెరిగింది. గత సంవత్సరం, టాటా గ్రూప్ ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా ఉండటానికి బీసీసీఐతో రూ.2500 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, టాటా గ్రూప్ ప్రతి సీజన్‌కు టైటిల్ స్పాన్సర్షిప్ కోసం రూ.500 కోట్లు చెల్లిస్తుంది. టాటా గ్రూప్స్, ప్రకటనలు, టికెట్స్, లైసెన్సింగ్ ఫీజు, స్టార్ స్పోర్ట్స్, రిలయన్స్ ఇండస్ట్సీస్ ద్వారా బీసీసీఐకి అదనంగా మనీ వస్తుంది.
𝐄𝐄 𝐒𝐀𝐋𝐀 𝐂𝐔𝐏 𝐍𝐀𝐌𝐃𝐔! ❤
— Star Sports (@StarSportsIndia) June 3, 2025
Congratulations, @RCBTweets! 🤩
LIVE NOW ➡ https://t.co/XmOkxMNq4t#IPLFinals 👉 Trophy Presentation on Star Sports Network & JioHotstar pic.twitter.com/Ud1PcaaDtf
బీసీసీఐ ఇన్కామ్ సోర్స్ :
ఐపీఎల్ సీజన్ 18 బీసీసీఐ ప్రతి టీమ్ నుంచి టికెట్ ఆదాయంలో 20%, లైసెన్సింగ్ ఫీజు నుంచి 12.5% ఆదాయాన్ని పొందింది. ఇలా టికెట్ పర్సెంటేజీ షేరింగ్, ప్రకటనలు, డిజిటల్ హక్కుల ద్వారా 2024 ఆర్థిక సంవత్సరంలో బీసీసీఐ రూ.16,493 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఈసారి ఈ మొత్తం ఇంకా పెరిగింది. ఈ సీజన్‌కుగానూ ఏకంగా రూ. 20,686 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలిసింది. ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యధికం కావడం విశేషం.
'సలామ్' పాటీదార్- ఎలైట్ లిస్ట్‌లో రోహిత్ శర్మ సరసన RCB కెప్టెన్