ETV Bharat / sports

టాప్​ 2 నుంచి టాప్​ 3కి- ఆర్సీబీకి షాకిచ్చిన సన్​రైజర్స్- 42 పరుగులతో విజయం - IPL 2025 SRH VS RCB

ఐపీఎల్ 2025- బెంగళూరుపై హైదరాబాద్ విజయం

IPL 2025 SRH VS RCB
IPL 2025 SRH VS RCB (AP)
author img

By ETV Bharat Sports Team

Published : May 23, 2025 at 11:36 PM IST

Updated : May 23, 2025 at 11:56 PM IST

1 Min Read

IPL 2025 SRH VS RCB : ఐపీఎల్ 2025లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్​​లో సన్​రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఘన విజయం సాధించింది. శుక్రవారం జరిగిన మ్యాచ్​లో 42 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంపై కన్నేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు షాక్‌ ఇచ్చింది హైదరాబాద్ జట్టు.

అయితే ఈ ఓటమితో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి పడిపోయింది. పంజాబ్ కింగ్స్‌ జట్టు రెండో స్థానానికి చేరుకుంది. అదే సమయంలో పాయింట్ల పరంగా (17) ఇరు జట్లకు ఒకటే కాగా నెట్‌రన్‌రేట్‌లో మాత్రం పంజాబ్ (+0.389) కంటే ఆర్సీబీ (+0.255) వెనుకబడింది. అందుకే ఆర్సీబీని వెనక్కినెట్టింది పంజాబ్. ఆ జట్టుకు ఇంకా రెండు మ్యాచులు ఆడాల్సి ఉండగా బెంగళూరుకు ఒకటే మిగిలి ఉంది.

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. తొలి డౌన్‌లో వచ్చిన ఇషాన్‌ కిషన్‌ (94*; 48బంతుల్లో 7×4, 5×6) అర్ధశతకంతో చెలరేగాడు. త్రుటిలో శతకం తప్పినా తన ఇన్నింగ్స్​తో అదరగొట్టాడు. క్రీజులో నిలదొక్కుకుంటూ బౌండరీల వర్షం కురిపించాడు. అభిషేక్‌ శర్మ(34; 17 బంతుల్లో 3×4, 3×6), అనికేత్‌ వర్మ (26; 9 బంతుల్లో 1×4, 3×6), క్లాసెన్‌ (24; 13 బంతుల్లో 2×4, 2×6) బాగానే ఆడారు.

హైదరాబాద్ బ్యాటర్లలో నితీశ్‌ రెడ్డి (4) మినహా మిగతావారంతా కనీసం ఒక్క ఫోర్‌ కొట్టకుండా క్రీజును వీడలేదు. అభినవ్‌ మనోహర్‌ (12; 11 బంతుల్లో 1×4), కమిన్స్‌ ( 13*; 6 బంతుల్లో 1×4) ఫర్వాలేదనిపించారు. బెంగళూరు బౌలర్లలో రొమారియో షెపర్డ్‌ 2 వికెట్లు పడగొట్టగా, భువనేశ్వర్‌, లుంగి ఎంగిడి, సూయష్‌, కృనాల్‌ తలో వికెట్‌ పడగొట్టారు. భారీ లక్ష్యంతో రాయల్​ ఛాలెంజర్స్ బెంగళూరు 189 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ తప్ప మిగతా నిరాశపరిచారు. తద్వారా ఓటమి చవిచూసింది.

Last Updated : May 23, 2025 at 11:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.