IPL 2025 RR VS CSK : ఐపీఎల్ 18వ సీజన్‌ను రాజస్థాన్ రాయల్స్ జట్టు విజయంతో ముగించింది. చెన్నైతో మంగళవారం జరిగిన తన చివరి మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. చెన్నై మొత్తం 10 మ్యాచుల్లో ఓటమిపాలైంది.
తొలుత చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 187/8 పరుగులు సాధించింది. సీఎస్కే బ్యాటర్లలో ఓపెనర్ ఆయుష్ మాత్రే (43; 20 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్), డెవాల్డ్ బ్రెవిస్ (42; 25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) అదరగొట్టారు. శివమ్ దూబె (39; 32 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడు ప్రదర్శించాడు. ఉర్విల్ పటేల్ (0), రవీంద్ర జడేజా (1) నిరాశపరించారు. డేవాన్ కాన్వే (10), రవిచంద్రన్ అశ్విన్ (13), ధోనీ (16) పరుగులు మాత్రమే చేశారు. రాజస్థాన్ బౌలర్లలో యుధ్విర్ సింగ్ 3, ఆకాశ్ మధ్వాల్ 3, తుషార్ దేశ్‌పాండే, హసరంగ ఒక్కో వికెట్ పడగొట్టారు
ఆ తర్వాత 189 లక్ష్యంతో బరిలో దిగిన రాజస్థాన్ దాన్ని 17.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వైభవ్ సూర్యవంశీ (57; 33 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధశతకంతో మరోసారి అదరగొట్టాడు. సంజు శాంసన్ (41: 31 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్), యశస్వి జైస్వాల్ (36; 19 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడు ప్రదర్శించారు. చివర్లో ధ్రువ్ జురెల్ (31*; 12 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), హెట్‌మయర్ (12*; 5 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) మెరుపులు మెరిపించి జట్టుని విజయతీరాలకు చేర్చారు. చెన్నై బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 2, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్ చెరో వికెట్ తీశారు. మొత్తం 14 మ్యాచ్‌ల్లో రాజస్థాన్ 4 విజయాలు సాధించింది.