ETV Bharat / sports

పంజాబ్ ఓనర్ల మధ్య గొడవ- కోర్టుకెక్కిన ప్రీతి జింటా - IPL 2025

11 ఏళ్ల తర్వాత ప్లేఆఫ్స్​కు పంజాబ్- అంతలోనే ఓనర్ల మధ్య గొడవ

Preity Zinta Court Case
Preity Zinta Court Case (Source : IANS)
author img

By ETV Bharat Sports Team

Published : May 23, 2025 at 1:53 PM IST

2 Min Read

Preity Zinta Court Case : ఇండియన్ ప్రీమియర్​ లీగ్​లో పంజాబ్​ కింగ్స్ టీమ్​కు శ్రేయస్​ అయ్యర్​ నాయకత్వం వహిస్తున్నాడు. అతడి కెప్టెన్సీలో పంజాబ్​ వరుస విజయాలతో దూసుకుపోతోంది. 11 ఏళ్ల తర్వాత పంజాబ్ ప్లేఆఫ్స్​కు అర్హత సాధించింది. ఈసారి టాప్​- 2లోనూ నిలిచే ఛాన్స్ ఉంది. ఇంతలో ఆ జట్టులో గందరగోళం ఏర్పడింది. పంజాబ్​ కింగ్స్ సహ యజమాని ప్రీతి, ఆ జట్టు​ డైరెక్టర్లు మోహిత్ బుర్మాన్​, నెస్ వాడియాపై ఛండీగఢ్​ కోర్టులో పిటిషన్ వేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ ఇద్దరూ సమావేశం నిర్వహించారంటూ పిటిషన్​లో పేర్కొన్నారు.​

మోహిత్‌ బుర్మాన్‌, నెస్‌ వాడియా ఈ ఇద్దరూ నిబంధనలకు విరుద్ధంగా గత నెల సమావేశం నిర్వహించి, మునీశ్ ఖన్నాను కొత్త డైరెక్టర్‌గా ఎన్నుకున్నారని, ఆ నియామకాన్ని నిలిపివేయాలని ప్రీతి తన పిటిషన్​లో పేర్కొన్నారు. అలాగే ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కూడా అమలు చేయకుండా చూడాలని పేర్కొన్నారు. కంపెనీ చట్టం 2013 ప్రకారం నిబంధనలకు విరుద్ధంగా ఈ సమావేశం నిర్వహించారని ప్రీతి తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

అయితే మోహిత్‌ బుర్మాన్‌, నెస్‌ వాడియా, ప్రీతి ఈ ముగ్గురు KPH డ్రీమ్‌ క్రికెట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్లుగా ఉన్నారు. పంజాబ్‌ కింగ్స్‌ జట్టు ఈ కంపెనీకి చెందినదే. గతనెల 21న నిర్వహించిన సమావేశంలో ప్రీతితోపాటు మరో డైరెక్టర్‌ కరణ్‌ పాల్​ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలోనే కొత్త డైరెక్టర్​గా మునీశ్‌ ఖన్నాను నియమించడాన్ని ప్రీతి వ్యవతిరేకించారు. ఈ క్రమంలోనే ఓనర్ల మధ్య వివాదం ముదిరింది. తాను ఈ మీటింగ్​కు హాజరైనప్పటికీ ఇది చట్ట విరుద్ధంగా ఏర్పాటు చేశారని, ఈ నియామకాన్ని నిలిపివేయాలని ప్రీతి కోర్టును కోరారు. కాగా, బోర్డులో వివాదాలు చెలరేగినప్పటికీ పంజాబ్​ కింగ్స్​ మ్యాచ్​లకు డైరెక్టర్​ ప్రీతి జింటా హాజరయ్యారు. జట్టుకు మద్దతుగా నిలుస్తూ ప్లేయర్లను ప్రోత్సహిస్తున్నారు.

ఇక ఈ సీజన్​లో ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన పంజాబ్, మరో రెండు మ్యాచ్​లు ఆడాల్సి ఉంది. మే 24న జైపూర్‌లో దిల్లీ క్యాపిటల్స్‌తో, మే 26న ముంబయి ఇండియన్స్‌తో ఆడనుంది.

మయాంక్​పై వేటు.. పంజాబ్‌ కింగ్స్‌ కొత్త కెప్టెన్‌గా శిఖర్‌ ధావన్‌

కీలక మ్యాచ్​లో విక్టరీ- ప్లేఆఫ్స్​కు ముంబయి- ఇంటికి దిల్లీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.