IPL 2025 RCB vs PBKS : ఐపీఎల్18లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) 5 వికెట్ల తేడాతో నెగ్గింది. వర్షం అంతరాయంతో 14 ఓవర్లకు కుదించిన ఈమ్యాచ్‌లో తొలుత బెంగళూరు 9 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్ (50*) అర్ధశతకంతో చెలరేగాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 2, యాన్సెన్ 2, చాహల్ 2, హర్‌ప్రీత్ బ్రార్ 2, బార్ట్‌లెట్ ఒక వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన పంజాబ్ 12.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆ జట్టులో నేహల్ వధేరా (33*) రాణించాడు. బెంగళూరు బౌలర్లలో హేజిల్ వుడ్ 3, భువనేశ్వర్ 2 వికెట్లు తీశారు.
చెలరేగిన పంజాబ్ బౌలర్లు కుప్పకూలిన బెంగళూరు
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరును పంజాబ్ బౌలర్లు ఆడుకున్నారు. తొలి ఓవర్ నాలుగో బంతికే అర్ష్‌దీప్ బౌలింగ్‌లో ఫిల్ సాల్ట్ (4) క్యాచ్ ఔటయ్యాడు. మరో ఓపెనర్ కోహ్లీ సైతం (1) అర్ష్‌దీప్ బౌలింగ్‌లోనే వెనుదిరిగాడు. స్వల్ప తేడాతో బార్ట్‌లెట్ బౌలింగ్‌లో లివింగ్ స్టోన్ (4) పెవిలియన్ చేరాడు. ఆరో ఓవర్ ఓవరి బంతికి జితేశ్ శర్మ (2), ఏడో ఓవర్ తొలి బంతికి కృనాల్ పాండ్య (1) ఔటయ్యారు. దీంతో సగం ఓవర్లు కాకముందే బెంగళూరు 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాతి ఓవర్లోనే రజత్‌పటీదార్ (23) చాహల్ బౌలింగ్‌లో డగౌట్‌కు చేరాడు. యాన్సన్ వేసిన తొమ్మిదో ఓవర్లో భాండగే వికెట్ల ముందు దొరికిపోయాడు. 10 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు 47/7 పరుగులతో నిలిచింది. 11 ఓవర్లో టిమ్ డేవిడ్ రెండు ఫోర్లు కొట్టడంతో ఆ ఓవర్లో మొత్తం 12 పరుగులు వచ్చాయి. ఇక 12వ ఓవర్లో హర్‌ప్రీత్ వరుస బంతుల్లో భువనేశ్వర్, యశ్ దయాల్‌ను ఔట్ చేశాడు. అప్పటికి స్కోర్ 63/0 పరుగులు. దీంతో ఆ జట్టు 70 పరుగులైన చేస్తుందా అనిపించింది. అయితే 13 ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన డేవిడ్ హర్‌ప్రీత్ వేసిన చివరి ఓవర్లో చివరి మూడు బంతులను సిక్స్‌లుగా మలిచాడు. దీంతో బెంగళూరు గౌరవప్రదమైన స్కోర్ చేసింది.