ETV Bharat / sports

ముంబయి గ్రాండ్ విక్టరీ- హైదరాబాద్​కు ఐదో ఓటమి - IPL 2025

సన్​రైజర్స్​పై 4 వికెట్ల తేడాతో ముంబయి విజయం

IPL 2025 MI VS SRH
IPL 2025 MI VS SRH (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : April 17, 2025 at 11:24 PM IST

2 Min Read

IPL 2025 MI VS SRH : ఐపీఎల్‌ 18లో సన్స్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఐదో ఓటమి చవిచూసింది. వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌పై ముంబయి ఇండియన్స్‌ 4 వికెట్ల తేడాతో నెగ్గింది. తొలుత హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అభిషేక్‌ శర్మ (40), క్లాసెన్‌ (37) రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబయి 18.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆ జట్టులో ర్యాన్‌ రికెల్టన్‌ (31), విల్‌ జాక్స్‌ (36), రోహిత్‌ శర్మ (26), సుర్యకుమార్‌ యాదవ్‌ (26), హార్దిక్‌ పాండ్య (21) రాణించారు. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో కమిన్స్‌ 3, ఎషాన్‌ మలింగ 2, హర్షల్‌ పటేల్‌ ఒక వికెట్‌ తీశారు. ముంబయికి ఇది వరుసగా రెండో విజయం.

తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌, ముంబయి బౌలర్లు ధాటికి 162 పరుగులకే పరిమితం అయింది. ఓపెనర్‌ అభిషేక్ శర్మ (40; 28 బంతుల్లో 7 ఫోర్లు), హెన్రిచ్ క్లాసెన్ (37; 28 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మాత్రమే రాణించారు. ట్రావిస్ హెడ్ (28; 29 బంతుల్లో 3 ఫోర్లు) పరుగులు చేయడంలో ఇబ్బంది పడ్డాడు. ఇషాన్ కిషన్ (2) సింగిల్ డిజిట్‌ స్కోరుకే వెనుదిరిగాడు. నితీశ్‌ కుమార్ రెడ్డి (19) పరుగులు చేశాడు. చివర్లో అనికేత్ వర్మ (18*; 8 బంతుల్లో 2 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు. ముంబయి బౌలర్లలో విల్ జాక్స్‌ 2, హార్దిక్ పాండ్య, జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

ఇన్నింగ్స్ తొలి బంతికే జీవదానం అందుకున్న ఓపెనర్ అభిషేక్ దూకుడుగా ఆడాడు. నిలకడగా బౌండరీలు బాదాడు. దీపక్ చాహర్ వేసిన ఐదో ఓవర్‌లో హ్యాట్రిక్ ఫోర్లు కొట్టాడు. ఈ క్రమంలో ఏడు ఓవర్లకు హైదరాబాద్ 53/0తో మెరుగైన స్థితిలో నిలిచింది. కానీ, హార్దిక్ పాండ్య బంతి అందుకున్నప్పటి నుంచి సన్‌రైజర్స్ పరుగుల వేగం నెమ్మదించింది. హార్దిక్.. ఇన్నింగ్స్‌ ఎనిమిదో ఓవర్‌లో అభిషేక్‌ను వెనక్కి పంపాడు. ఆ వెంటనే విల్ జాక్స్‌ బౌలింగ్‌లో ఇషాన్‌ కిషన్‌ స్టంపౌటయ్యాడు.

ట్రావిస్ హెడ్ క్రీజులో ఉన్నా బ్యాట్ ఝళిపించలేకపోయాడు. హెడ్‌ను జాక్స్‌ ఔట్ చేశాడు. నితీశ్‌ కూడా దూకుడుగా ఆడలేకపోయాడు. దీంతో 11-16 ఓవర్ల మధ్య 37 పరుగులే వచ్చాయి. 17వ ఓవర్‌లో నితీశ్‌ను బౌల్ట్ పెవిలియన్‌కు పంపాడు. దీపక్ చాహర్ వేసిన 18 ఓవర్‌లో క్లాసెన్ వరుసగా 6, 4, 4, 6 బాదేయడంతో స్కోరు బోర్డులో కదలిక వచ్చింది. దూకుడు మీదున్న క్లాసెన్‌ను బుమ్రా క్లీన్‌బౌల్డ్ చేశాడు. హార్దిక్ వేసిన చివరి ఓవర్‌లో అనికేత్ రెండు సిక్స్‌లు, కమిన్స్ (8*) ఒక సిక్స్‌ బాదడంతో స్కోరు 160 దాటింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.