IPL 2025 RCB vs KKR : భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయిన ఐపీఎల్ తిరిగి ప్రారంభమైన అభిమానులకు నిరాశే ఎదురైంది. ఎంతో ఆసక్తిగా ఉన్న ఐపీఎల్ తొలి మ్యాచ్ వర్షార్పణమైంది. శనివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరగాల్సిన కనీసం టాస్ కూడా పడుకుండానే మ్యాచ్ రద్దయింది. నిబంధనల ప్రకారం ఇరుజట్లకు చెరో పాయింట్ కేటాయించారు. 13 మ్యాచ్‌ల్లో 12 పాయింట్లు సాధించిన కోల్‌కతా ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది.
శనివారం సాయంత్రం నుంచి వర్షం మొదలైంది. తొలుత చిన్నపాటి జల్లుగా మొదలై క్రమంగా పెరిగింది. తర్వాత కొద్దిసేపు తగ్గడం వల్ల మ్యాచ్‌ను ప్రారంభించేందుకు వీలుగా మైదానాన్ని రెడీ చేసేందుకు సిబ్బంది రంగంలోకి దిగారు. అయితే, కాసేపటికే మళ్లీ వర్షం మొదలైంది. వాన తగ్గితే కనీసం 5 ఓవర్ల మ్యాచ్‌నైనా నిర్వహించాలని చూశారు. కానీ, ఎడతెరిపి లేకుండా వాన కురువడం వల్ల మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.
Rain has the last laugh! 🌧
— Star Sports (@StarSportsIndia) May 17, 2025
& with that, #RCB sit comfortably at the top spot while #KKR bow out of the #IPLRace2Playoffs, as both teams share a point each.
Next up #IPLOnJioStar 👉 #RRvPBKS | SUN, 18 MAY, 2:30 PM | LIVE on Star Sports 1, Star Sports 1 Hindi, Star Sports 2,… pic.twitter.com/CYjo2PXUaw
కోల్‌కతా ఔట్
ఐపీఎల్ తిరిగి ప్రారంభం కావడం వల్ల ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్స్ చేరాలనుకున్న కోల్‌కతా ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్న కేకేఆర్ ఈ మ్యాచ్ రద్దవడం వల్ల లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. ప్రస్తుతం కేకేఆర్ 13 మ్యాచ్‌లు ఆడి 12 పాయింట్లతో ఉంది. చివరి లీగ్ మ్యాచ్‌లో (హైదరాబాద్‌తో) గెలిచినా కోల్‌కతాకు పెద్దగా ప్రయోజనం ఉండదు. ఇక, కేకేఆర్‌పై గెలిచి అధికారికంగా ప్లే ఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకుందామనుకున్న ఆర్సీబీకు కూడా నిరాశే ఎదురైంది. అయితే, 12 మ్యాచ్‌లు ఆడి 17 పాయింట్లతో ఉన్న బెంగళూరు, మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఓడినా ప్లే ఆఫ్స్‌కు చేరేందుకు ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆర్సీబీ అగ్రస్థానంలో ఉంది.
No fairytales this time 💔
— Star Sports (@StarSportsIndia) May 17, 2025
The defending champs are out of playoffs contention. KKR close the curtains.#IPLOnJioStar pic.twitter.com/43DkmWQtDe