IPL 2025 GT Vs LSG : ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. 33 పరుగులతో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న గుజరాత్‌కు చిన్నపాటి షాక్ ఇచ్చింది.
తొలుత బ్యాటింగ్ చేసిన లఖ్‌నవూ భారీ స్కోరు సాధించింది. 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (117; 64 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్స్‌లు) చెలరేగిపోయాడు. నికోలస్ పూరన్ (56*; 27 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) దూకుడుగా ఆడి మెరుపు అర్ధ శతకంతో దుమ్మురేపాడు. మార్‌క్రమ్ (36) పరుగులు చేశాడు. గుజరాత్ బౌలర్లలో అర్షద్, సాయికిశోర్ చెరో వికెట్ తీశారు.
అనంతరం భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 200/9 పరుగులు చేసింది. షారుఖ్ ఖాన్ (55) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లఖ్‌నవూ బౌలర్లలో విలియమ్ ఒరూర్కే 3, అవేశ్ ఖాన్ 2, ఆయుశ్ బదోనీ 2, ఆకాశ్ మహరాజ్, షాబాజ్ అహ్మద్ చెరో వికెట్ తీశారు. లఖ్‌నవూ ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఇప్పటికే వైదొలిగింది.