ETV Bharat / sports

గుజరాత్ ఆల్​రౌండ్ షో- కోల్​కతాపై ఘన విజయం - IPL 2025

కోల్​కతాపై గుజరాత్ ఘన విజయం

IPL 2025 GT VS KKR
IPL 2025 GT VS KKR (ASSOCIATED PRESS)
author img

By ETV Bharat Telugu Team

Published : April 21, 2025 at 11:22 PM IST

1 Min Read

IPL 2025 GT VS KKR : ఐపీఎల్‌ 18లో గుజరాత్‌ టైటాన్స్‌కు ఆరో విజయం. కోల్‌కతాను గుజరాత్‌ 39 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ సీజన్‌లో విజయాల పరంపర కొనసాగిస్తున్న గుజరాత్‌ ఆరో విజయం సాధించింది. తొలుత టైటాన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులకే పరిమితం అయింది. ఆ జట్టులో కెప్టెన్‌ అజింక్యా రహానె (50: 36 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌) టాప్‌ స్కోరర్‌. ఆండ్రీ రస్సెల్‌ (21), రఘువంశీ (27*), రింకు సింగు (17) పరుగులు చేశారు. గుజరాత్‌ బౌలర్లలో రషీద్‌ ఖాన్‌ 2, ప్రసిద్ధ్‌ కృష్ణ 2, సిరాజ్‌, వాషింగ్టన్‌ సుందర్, సాయి కిశోర్‌, ఇషాంత్‌ శర్మ ఒక్కో వికెట్‌ తీశారు.

తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌కు శుభ్‌మన్‌ గిల్‌ (90: 55 బంతుల్లో 10 ఫోర్లు, 3సిక్స్‌లు), సాయి సుదర్శన్‌ (52: 36 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్‌) తొలి వికెట్‌ 114 పరుగులు చేసి మంచి శుభారంభం అందించారు. అయితే గిల్‌ త్రుటిలో సెంచరీ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. సాయి సుదర్శన్ మరోసారి అదరగొట్టాడు. గత మ్యాచ్‌లో చెలరేగిన జోస్ బట్లర్ (41*; 23 బంతుల్లో 8 ఫోర్లు) ఈ మ్యాచ్‌లోనూ విరుచుకుపడ్డాడు. కోల్‌కతా బౌలర్లలో వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, రస్సెల్ తలో వికెట్ పడగొట్టారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.